New Zealand : 2024 జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్(T20 World Cup) సంగ్రామం మొదలుకాబోతున్న సంగతి తెలిసిందే. కాగా మే 1లోగా స్క్వాడ్లను ప్రకటించాలని ఐసీసీ(ICC) ప్రకటన విడుదల చేసింది. దీంతో ఈ మెగా టోర్నీకి అర్హత సాధించిన జట్లు తమ తుది జట్టును ప్రకటించే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్ర లోగా భారత సెలక్టర్లు టీమ్‌ను వెల్లడించే అవకాశం ఉండగా.. న్యూజిలాండ్ బోర్డు భిన్నమైన సైల్ లో తమ జట్టును ప్రకటించింది.
View this post on Instagram
మేం ఇక్కడికి వచ్చింది అందుకే..
ఈ మేరకు తుది జట్టు ప్రకటించేముందు కెప్టెన్ లేదా చీఫ్ సెలక్టర్, ప్రధాన కోచ్ మీడియా సమావేశం నిర్వహించి అనౌన్స్ చేస్తారు. కానీ న్యూజీలాండ్ బోర్డు మాత్రం వినూత్నంగా ప్రకటించింది. ఇద్దరు చిన్నారులు ఆంగస్, మటిల్దా లో ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి సభ్యుల పేర్లు వెల్లడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరల్ అవుతుండగా.. చిన్నారుల లాంగ్వేజ్ స్టైల్, ప్రకటన తీరుకు ఫిదా అవుతున్నారు
‘హాయ్. మేం ఇక్కడికి వచ్చింది వరల్డ్ కప్(World Cup) జట్టును ప్రకటించడానికే. ఈ అవకాశం రావడం అనందంగా ఉంది. యూఎస్ఏ- విండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ కోసం కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్‌ను ఎంచుకున్నాం’ అన్నారు. కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైకెల్ బ్రాస్‌వెల్, మార్క్ చాప్మన్, డేవన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఐష్ సోధి, టిమ్ సౌథి. ట్రావెలింగ్ రిజర్వ్: బెన్ సీర్స్.. పేర్లను ఫైనల్ చేశారు.
ఇది కూడా చదవండి: Virender Sehwag: అశ్విన్ కెరీర్ పై సెహ్వాగ్ జోష్యం.. తీసుకోవడం వృథా అంటూ!
ఇక దీనిపై మాట్లాడిన కివీస్ కోచ్ గ్యారీ స్టీడ్.. ప్రపం కప్ కోసం ఎంపికైన వారందరికీ కంగ్రాట్స్. ఈ టోర్నీల్లో దేశం కోసం ప్రాతినిధ్యం వహించే ప్రత్యేక సందర్భమిది. విండీస్ – యూఎస్ఏ పరిస్థితులను త్వరగా అలవాటు చేసుకొనే స్క్వాడ్‌ను ఎంపిక చేశామని భావిస్తున్నా. మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర అంతర్జాతీయ క్రికెట్లో అదరగొట్టేస్తున్నారు. ఈ ఏడాది ఎలాగైనా కప్ కొట్టేస్తాం అంటూ ధీమా వ్యక్తం చేశాడు.