NEW YEAR Celebrations: కొత్త ఏడాది వేడుకల సందర్భంగా విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఎక్కడ డ్రగ్స్ సరఫరా, వినియోగం జరిగినా దాడులు ఖాయమని చెప్పారు. ఏదైనా కేసులో ఇరుక్కుంటే ముఖ్యంగా యువత తమ భవిష్యత్తును తామే నాశనం చేసుకున్న వారవుతారని హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈవెంట్ల నిర్వాహ కులు, పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్ల యాజ మాన్యాలదేనని సూచించారు. మద్యం సేవించి వాహ నాలతో రోడ్ల మీదకు రావద్దని చెప్పారు. డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్ మొత్తంగా విస్తృతస్థాయిలో డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు జరుపుతామన్నారు.
ALSO READ: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్.. రేపే లాస్ట్ !
న్యూఇయర్ నేపథ్యంలో ఇవాళ రాత్రి 8 గంటల నుంచే పోలీసులు డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేపట్టనున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే.. బండి సీజ్ చేసి, రూ. 10వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష విధించనున్నట్లు తెలిపారు. న్యూఇయర్ వేడుకలు అర్ధరాత్రి ఒంటిగంట దాటాక కూడా కొనసాగిస్తే కేసులు నమోదు చేయాలని రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు రాష్ట్ర DGP కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 చెకింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశారు పోలీస్ అధికారులు.
రాత్రి 1 గంటలకు రయ్యిమంటూ మెట్రో పరుగులు…
న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్టు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తెలిపింది. చివరి ట్రిప్ 12 గంటల 15 నిమిషాలకు వివిధ స్టేషన్ల నుంచి బయల్దేరి ఒంటి గంట కల్లా గమ్యస్థానాలను చేరుకోనున్నట్లు వెల్లడించింది. సెక్యూరిటీ వింగ్స్ మెట్రో స్టేషన్లు, మెట్రో రైళ్లలో నిఘాను ముమ్మరం చేయనున్నట్లు వివరించింది. మద్యం తాగిన వారిని, ఇతరులతో అసభ్యకరంగా ప్రవర్తించే వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది.
ALSO READ: త్వరలోనే మెగా డీఎస్సీ.. సీఎం రేవంత్ ఆదేశాలు