Maoist: కోవర్టు ఆరోపణలతో బంటి రాధను మావోయిస్టులు హతమార్చిన విషయం తెలిసిందే. కాగా హత్యకు ముందు పోలీసులతో సంబంధాలపై బంటి రాధ మాట్లాడిన ఒక ఆడియో RTV చేతికి అందింది. ఈ ఆడియోలో తన తమ్ముడిని అడ్డం పెట్టుకుని మావోయిస్టు పార్టీ గురించి పోలీసులు వివరాలు అడిగినా తానేమీ చెప్పలేదని, ప్రజాసంఘాల వివరాలు అడిగిన దాటవేశానని రాధ వివరించింది.
నీ తమ్ముడు నా చేతిలో ఉన్నాడంటూ..
ఈ మేరకు రాధ ఆడియో ప్రకారం..’ఓ వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. అతడు పోలీసే అని విషయం నాకు అర్థమైంది. నీ తమ్ముడు నా చేతిలో ఉన్నాడని బెదిరించాడు. మావోయిస్టుల గురించి ఆరా తీశాడు. ప్రతి రోజూ వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసేవాడు. క్యాంప్‌లో ఏ పని చేస్తావని అడిగాడు. మిమ్మల్ని ఎవరెవరూ కలుస్తారు? ప్రజా సంఘాల నాయకులు వస్తారా? అని అడిగాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించాడు. అతడికి నేను ఏమి చెప్పలేదు’ అంటూ ఆమె స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక గత 3 వారాల క్రితం హైదరాబాద్ కాప్రాకు చెందిన రాధను కోవర్టు అంటూ మావోయిస్టులు చంపేశారు. ఆమె మృతదేహాన్ని ఏవోబీ బార్డర్ లో రోడ్డుమీద ఉంచి అక్కడే లేఖ వదిలి వెళ్లారు. మావోయిస్టు పార్టీకి ద్రోహం చేసినందుకే రాధను చంపాల్సివచ్చిందని, ప్రజా కోర్టులో మరణ శిక్ష విధించామని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.