Hyderabad Gang Rape: హైదరాబాద్‌లో మరో గ్యాంగ్ రేప్ కలకలం రేపింది. వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై అత్యాచారం జరిగింది. ఓంకార్నగర్లోని బొమ్మరిల్లు హోటల్లో ఘటన జరిగింది. నిందితుడు హయత్‌నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన గౌతంరెడ్డిగా గుర్తించారు. యువతికి గౌతంరెడ్డి చిన్ననాటి ఫ్రెండ్. నిన్న సాయంత్రం రెస్టారెంట్‌కి వెళ్లారు గౌతంరెడ్డి, యువతి. మద్యం సేవించి హోటల్లోని రూమ్‌కి ఇద్దరు వెళ్లారు. మత్తు నుంచి బయటకు వచ్చి చూసే సరికి గౌతమ్‌తోపాటు గదిలో మరో వ్యక్తి ఉన్నాడు. రక్తపు మడుగులో యువతి పడి ఉంది. ఐడీ ప్రూఫ్ ఆధారంగా యువతి కుటుంబానికి సమాచారం అందించారు. గౌతంరెడ్డి, అతని స్నేహితుడు పరారీలో ఉన్నారు. తన స్నేహితుడితోపాటు మరొకరు మద్యం మత్తులో అత్యాచారం చేశారని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.
వెలుగులోకి సంచలన విషయాలు..
హైదరాబాద్ వనస్థలిపురంలో గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతిని నమ్మించి హోటల్‌కు తీసుకొచ్చాడు గౌతంరెడ్డి. యువతికి ఇటీవల సాఫ్ట్వేర్ జాబ్ రావడంతో తనకు స్పెషల్‌గా పార్టీ ఇవ్వాలని కోరాడు గౌతంరెడ్డి. గౌతంరెడ్డిని నమ్మి శ్రీరస్తు బార్ అండ్ రెస్టారెంట్‌కు వచ్చింది ఆ యువతి. రూం నంబర్ 309లో మందు పార్టీ చేసుకున్నారు గౌతంరెడ్డి, యువతి. తర్వాత తన ఫ్రెండ్‌కు ఫోన్ చేసి రప్పించాడు గౌతంరెడ్డి. ఫ్రెండ్‌తో కలిసి యువతిపై అఘాయిత్యానికి గౌతం రెడ్డి పాల్పడ్డాడు. గౌతంరెడ్డి స్వస్థలం హైదరాబాద్ హయత్‌నగర్ లెక్చరర్స్ కాలనీ. తన స్నేహితుడితోపాటు మరొకరు మద్యం మత్తులో అత్యాచారం చేశారని పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు చేయగా .. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : అకౌంట్లోకి డబ్బు జమ