ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలోని పలు మార్గాల్లో 9 వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు. కేంద్రరైళ్ల శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ 9 వందేభారత్ రైళ్లు 11 రాష్ట్రాల్లో కనెక్టివిటీన పెంచాయి. అందులో రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఏపీ, బీహార్, వెస్ట్ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరు యశ్వంతపూర్ కు వందే భారత్ ఎక్స్ప్రెస్…బయలు దేరింది. జెండా ఊపి ట్రైన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.
కాగా తెలంగాణ, ఏపీలో రెండు మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. తెలంగాణ నుంచి మూడో వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను మోదీ ప్రారంభించారుర. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా తెలంగాణకు ప్రాధాన్యతను ఇస్తుంది కేంద్రం. ఇప్పటికే సంక్రాంతి కానుకగా సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలును ఉగాది కానుకుగా సికింద్రాబాద్ -తిరుపతి వందేభారత్ రైలును కేంద్రం ప్రారంభించింది. ఇప్పుడు మరోసారి వినాయకచవితి నవరాత్రులకు కానుకగా ఇవాళ కాచిగూడు బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభించారు ప్రధాని మోదీ.
ఇది కూడా చదవండి: ఏపీలో 434 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి!
ఇది తెలంగాణ నుంచి మూడో వందే భారత్ ఎక్స్ ప్రెస్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్, కేంద్రమంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ రైళ్లు ప్రతిరోజూ కాచిగూడ నుంచి ఉదయం 5.30గంటలకు బయలుదేరుతుంది. మహబూబ్ నగర్, కర్నూల్, అనంతపూర్ స్టేషన్లో ఆగుతూ..యశ్వంత్ పూర్ కు మధ్యాహ్నం 2.15కు చేరుకుంటుంది. మధ్యాహ్నం 3గంటలకు యశ్వంత్ పూర్ నుంచి బయలు దేరి రాత్రి 11.15గంటలకు కాచిగూడ చేరుకుంటుందని కేంద్రం తెలిపింది. ఆదివారం ఒక్కరోజు మాత్రం మధ్యాహ్నం 12.30కి కాచిగూడు నుంచి బయలుదేరి ఫలక్ నుమా, ఉందానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర, గద్వాల్ మీదుగా యశ్వంత్ పూర్ చేరుకుంటుంది.
ఇది కూడా చదవండి: ల్యాండర్, రోవర్ సంకేతాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోన్న ఇస్రో..!!
మూడో వందేభారత్ రైలు 12 జిల్లాల గుండా ప్రయాణించనుంది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, ఏపీలో కర్నూలు, నంద్యాల, అనంతపూర్, శ్రీ సత్యసాయి , కర్నాటక చిక్ బళ్లాపూర్, బెంగళూరు రూరల్ మీదుగా ప్రయాణిస్తుంది. దీని సగటు వేగం గంటకు 71.74 కిలోమీటర్లతో దూసుకుపోతుంది. గతంలో ఈ దూరం ప్రయాణించేందుకు పట్టే సమయం 11.20గంటలు కాగా వందేభారత్ రైలుతో 8.30 గంటల్లో ప్రయాణించవచ్చని కేంద్రం తెలిపింది.
వందే భారత్ రైళ్ల ప్రారంభం వల్ల ప్రయోజనం పొందే రాష్ట్రాలు …
-రాజస్థాన్
-తమిళనాడు
-తెలంగాణ
-ఆంధ్రప్రదేశ్
-కర్ణాటక
-బీహార్
-పశ్చిమ బెంగాల్
-కేరళ
-ఒడిషా
-జార్ఖండ్
-గుజరాత్
Hon’ble PM Shri @narendramodi will flag off 9 #VandeBharat Express (through Video Conferencing) connecting different places today.
Andhra Pradesh gets two!🚄#Vijayawada – #Chennai and #Hyderabad – #Bengaluru pic.twitter.com/3XJ1R5mx3c
— DRM Vijayawada (@drmvijayawada) September 24, 2023
ఈ మార్గాల్లో రైళ్లు నడుస్తాయి:
-ఉదయపూర్-జైపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ (రాజస్థాన్)
-హైదరాబాద్-బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ (తెలంగాణ, కర్ణాటక)
-పాట్నా-హౌరా వందే భారత్ ఎక్స్ప్రెస్ (బీహార్ , పశ్చిమ బెంగాల్)
-రూర్కెలా-భువనేశ్వర్-పూరీ వందే భారత్ ఎక్స్ప్రెస్ (ఒడిశా)
-జామ్నగర్-అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ (గుజరాత్)
-రాంచీ-హౌరా వందే భారత్ ఎక్స్ప్రెస్ (జార్ఖండ్, పశ్చిమ బెంగాల్)
-తిరునెల్వేలి-మధురై-చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ (తమిళనాడు)
-విజయవాడ-రేణిగుంట-చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ (ఆంధ్రప్రదేశ్ ,తమిళనాడు)
-కాసరగోడ్-తిరువనంతపురం వందే భారత్ ఎక్స్ప్రెస్ (కేరళ)