Vatry Airport : కొద్ది రోజుల క్రితం మానవ అక్రమ రవాణా అనుమానంతో ఫ్రాన్స్ అధికారులు 303 మంది భారతీయులతో వెళ్తున్న విమానాన్ని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంఘటనకు గురించిన అన్ని ఆటంకాలు తొలిగిపోయినట్లు అధికారులు తెలిపారు. మూడు రోజుల తరువాత సోమవారం నాడు విమానం బయల్దేరింది.
అయితే ఈ విమానం నికరాగువాకు వెళ్తుందా లేక దుబాయి(Dubai) కీ వస్తుందా లేక భారత్(India) కి వస్తుందా అన్నది అధికారులు ప్రకటించలేదు. ఫ్రెంచ్ న్యాయనిబంధనల ప్రకారం.. ఆదివారం ఈ సంఘటన గురించి న్యాయ విచారణ జరిగింది. న్యాయవిచారణకు సంబంధించిన వాట్రీ విమానాశ్రయంలోనే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ సంఘటన గురించి నలుగురు న్యాయమూర్తులు ప్రత్యేక విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన తరువాత విమానం వాట్రీ విమానాశ్రయం(Vatry Airport) నుంచి బయలుదేరడానికి అనుమతులు వచ్చాయి. అయితే విచారణ జరుగుతున్న సమయంలోనే కొందరు ప్రయాణికులు వారి కుటుంబ సభ్యులు, బంధువులతో ఫోన్లలో మాట్లాడినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే కేవలం ఓ కంపెనీ క్లయింట్ కోసం మాత్రమే విమానాన్ని నడిపినట్లు…హ్యుమాన్ ట్రాఫికింగ్ తో తమకు సంబంధం లేదని రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్లైన్స్ అధికారులు న్యాయమూర్తులకు తెలిపారు. ఈ విచారణ లో మానవ అక్రమ రవాణా గురించి రుజువైతే కనుకు 20 సంవత్సరాల క్రిమినల్ జైలు శిక్షతో పాటు 27 కోట్ల జరిమానా కూడా విధించే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు.
రొమెనియాకు చెందిన లెజెండ్ ఎయిర్ లైన్స్ విమానం యునైటెట్ అరబ్ ఎమిరేట్స్ నుంచి నికరాగువాకు బయల్దేరింది. ఫ్యూయల్ నింపుకోవడం కోసం శుక్రవారం నాడు ఫ్రాన్స్ లోని వాట్రీ ఎయిర్ పోర్టులో దిగింది. అప్పటికే మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం అందుకున్న ఫ్రాన్స్ అధికారులు ఈ విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
Also read: ట్రైన్ లో బిర్యానీ తిని అస్వస్థతకు గురైన ప్రయాణీకులు..ఆసుపత్రికి తరలింపు!