Himalayan Viagra: గొంగళి పురుగు నుంచి వయగ్రా ఏమిటని ఆశ్చర్యపోతున్నారా. హిమాలయాల్లో దొరికే ఈ అరుదైన ఔషదం.. గొంగళి పురుగుకు నేలలో ఉండే ఒకరకమైన ఫంగస్ సోకి, అది మరణించాక యర్సగుంబాగా మారుతుంది. ఈ ఫంగస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సహజ ఔషధంగా పరిగణించబడుతోంది. ఇది నపుంసుకత్వానికి మందులా మాత్రమే కాదు కేన్సర్, ఆస్తమా చికిత్సకు కూడా ఉపయోగపడుతుందని నాటు వైద్యులు చెబుతుండగా.. చైనా, అమెరికా, బ్రిటన్, జపాన్, థాయ్‌లాండ్ మరియు మలేషియా మార్కెట్లలో ఈ ఫంగస్‌కు చాలా డిమాండ్ ఉంది.
హిమాలయన్ వయాగ్రా..
ఈ మేరకు హిమాలయాల్లో లభించే ఔషధాన్ని ‘హిమాలయన్ వయాగ్రా’ అని కూడా అంటారు. ఈ యర్సగుంబా హిమాలయన్ వయాగ్రాగా ప్రసిద్ధి చెందింది. గొంగళి పురుగు ఆస్తమా, క్యాన్సర్, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల రుగ్మతలను నయం చేస్తుంది. అలాగే ఈ ఫంగస్ పురుషుల నపుంసకత్వానికి నయం చేయడానికి ఉపయోగిస్తున్నారు. శిలీంధ్రాలు సాధారణంగా ఆరోగ్యానికి హానికరం అయినప్పటికీ.. ఇది ఫంగల్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానీ ఇందులో కొన్ని రకాల శిలీంధ్రాలు మాత్రం ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు. గొంగళి పురుగుకు నేలలో ఉండే ఒకరకమైన ఫంగస్ సోకి అది మరణించాక యర్సగుంబాగా రూపాంతరం చెందుతుంది. ఈ ఫంగస్ విలువ లక్షల రూపాయలుంటుంది. ఇది 3 నుంచి 5 వేల మీటర్ల వరకూ ఎత్తు పెరుగుతుంది.
లక్షలాది మంది జీవనోపాధి..
ఇది పురుషుల లైంగిక శక్తిని పెంచడానికి అలాగే వివిధ రకాల ఔషధాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో కిలో ఈ ఫంగస్ 20 లక్షల రూపాయల వరకు పలుకుతోంది. దీనిని హిమాలయన్ బంగారం అని కూడా పిలుస్తారు. కానీ వాతావరణ మార్పు ఈ ఫంగస్‌ను ప్రభావితం చేస్తోంది. దీంతో ఈ ఫంగస్ వ్యాపారంపై ఆధారపడిన లక్షలాది మంది జీవనోపాధికి ముప్పు ఏర్పడింది. ఈ శిలీంధ్రం సిక్కిం, ఉత్తరాఖండ్‌లో విస్తారంగా సాగు చేయబడుతుంది. ఈ ఫంగస్‌ను రక్షించడానికి, అక్రమ వ్యాపారాన్ని నిరోధించడానికి వివిధ రాష్ట్రాలు వేర్వేరు విధానాలను కలిగి ఉన్నాయి. ఫంగస్‌ను అక్రమంగా సాగు చేయడం లేదా విక్రయించడం చట్టరీత్యా నేరం. ఈ ఫంగస్ దాదాపు 57 రకాల కీటకాలపై దాడి చేయగలదు.