తెలుగు రాష్ట్రాల్లో కందిపప్పు ధరలు పెరిగాయి. మిగతా పప్పుదినుసులు అదే ధరలో ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక వాడే కందిపప్పు ధర రెండు నెలల వ్యవధిలోనే రూ. 30కిపైగా పెరిగింది. జూలైలో 150 రూపాయాలు ఉన్న కందిపప్పు.. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో 180 రూపాయాలు ఉంది. కొన్ని ప్రాంతాల్లో 200 రూపాయల వరకు ఉంది. ఇతర పప్పుల ధరలు రూ.20 నుంచి 40 వరకు పెరిగాయి. అయితే ధర పెరగటానికి కారణం రాష్ట్రంలో పప్పు దినుసుల సాగువిస్తీర్ణం తగ్గడం, వాతావరణ ప్రతికూల పరిస్థితులతో దిగుబడి తగ్గటం వల్ల ఆ ప్రభావం ధరలపై పడింది. కంది పంటను తెలంగాణ, ఏపీతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. అయితే ఈ తెలుగురాష్ట్రాల్లో వరి, ఇతర వాణిజ్య పంటల సాగు పెరిగింది. దీంతో కంది సాగు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. కంది పప్పులో తాండూరు, కోల, నాగపూర్, దేశీయరకాలకు ఎక్కువగా డిమాండ్ ఉంది.
దిగుబడి తగ్గటం వల్ల
ఏపీలో పెరుగుతున్న నిత్యావసరాల ధరలు పెరగటంతో సామాన్య ప్రజలను ఆందోళనకు గురైతున్నారు. మొన్నటి వరకు టమాట ధరలు పెరిగి ప్రతి ఒక్కరికి చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. తాజాగా.. కందిపప్పు ధర పెరిగింది. అయితే నిన్నటి వరకు కేజీ కందిపప్పు150 రూపాయాలు ఉంటే.. నేడు ఏకంగా 50 రూపాయలు పెరిగి రూ.200లకు చేరుకుంది. దీంతో సామాన్య, పేద ప్రజలకు కందిపప్పు కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే పెట్రోల్,కరెంట్ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరల పెరగంటతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్లీ కందిపప్పు ధర పెరిగి ప్రజలకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. మరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను ఎలా నియంత్రిస్తాయో కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.
ఎదురు చూడాల్సిందే
కూరగాయల ధరలు ఆకాశాన్నంటితే.. ఇప్పుడు పప్పులతో సరిపెట్టుకునేవాళ్ల ఇంకా కష్టంగా మారిది. కానీ ఇప్పుడు పెరిగిన ధరలతో పప్పు కొనాలంటేనే ప్రజలు భయం పట్టుకుంది. దీంతో సామాన్యులు పప్పు లేకుండా పూట గడిచేది ఎలా..? అని వాపోతున్నారు. గతంలో చౌకధరల దుకాణాల ద్వారా సామాన్యులకు కందిపప్పు అందించేవారు. కానీ ఈ మధ్య అది కూడా అరకొరగానే అందుతోంది. ఈ ధరలు పెరటంతో తరచూ పప్పు తినేవారు ప్రత్యామ్నాయాల కోసం ఎదురు చూడాల్సిందే.
సీజన్లో ధరలు ఇలా ఉన్నాయి…
ఇక పెసరపప్పు ధర సీజన్లో గరిష్టంగా రూ.100లు పలకగా.. ఇప్పుడు 120 రూపాయలకు పైగానే ఉంది. ఆ శనగపప్పు ధర సీజన్లో రూ.65-70 ఉంటే.. ఇప్పుడు 90-100కు పెరిగింది. పచ్చిశనగపప్పు ధర కిలో రూ.65 ఉంటే ఇప్పుడు 90కి చేరింది. మినపపప్పు ధర రూ.80-100 మధ్యలో ఉండగా, ప్రస్తుతం రూ.120కి పెరిగింది. గతంలో వేరుశెనగ125 ఉంటే ఇప్పుడు రూ.150 160కి పెరిగింది. ఎర్రపప్పు రూ. 80-100కు పెరిగింది. పుట్నాల ధరలు కూడా కిలోకి రూ.20 వరకు పెరిగినట్టు పప్పుల వ్యాపారులు తెలిపారు.