బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో థర్డ్ వీకెండ్ అయిపోయింది. ఎప్పటిలాగే వీకెండ్ లో నాగార్జున వచ్చి సందడి చేసి వెళ్ళాడు. దానితో పాటూ లేడీ కంటెస్టెంట్ దామిని ఎలామినేషన్ కూడా చేశాడు. ఇది ఒకంత షాక్ అనే చెప్పొచ్చు. దామిని వెళ్ళిపోతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఒక్క యావర్ తో తప్ప దామిని కి పెద్దగా గొడవలు కూడా జరగలేదు. అయితే ఆమె గేమ్స్ లో అంత యాక్టివ్ గా లేకపోవడం…ఓన్లీ వంటంటికే పరిమితం అయిపోవడం…లాస్ట్ వీక్లో యావర్ కి ఇచ్చిన టాస్క్ లో వైల్డ్ గా ప్రవర్తించడం లాంటి వాటి వల్లనే ఎలిమినేషన్ అయిందనే టాక్ వినిపిస్తోంది. యావర్ పట్ట దామిని ప్రవర్తించిన తీరు ప్రేక్షకులకు నచ్చలేదని అంటున్నారు. అందుకే ఆమెకు చాలా తక్కువ ఓటింగ్స్ ఇచ్చచారని…కేవలం నాలుగు వాతం ఓట్లతో దామిని ఎలిమినేట్ అయిందని తెలుస్తోంది.
మూడు వారాల్లో ముగ్గురు లేడీ కంటెస్టెంట్ లు వెళ్ళిపోయారు. మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండవ వారం షకీలా, మూడవ వారం దామినిలు ఇంటి నుంచి బటయకు వెళ్ళిపోయారు. మొదటి వారం వదిలేస్తే మిగతా రెండు వారాల్లో ఎవరిని ఓట్ చేశాడో వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ఇక నాల్గవ వారంలో ఏమవుతుందో చూడాలి. ఈ వారం కూడా యావర్ ఓట్ చేసిన వాళ్ళు వెళ్ళిపోతారా… లేదా ఈ సెంటిమెంట్ కు బ్రేక్ పడుతుందా అనేది చూడాలి.
ఇక వీకెండ్ లో ఎప్పటిలానే నాగార్జున వచ్చిన సందడి చేశాడు. కంటెస్టెంట్స్ తో ఆటలు ఆడించాడు. ఆదివారం రాగానే చిట్టి ప్రశ్నలు అంటూ గేమ్ ఆడించాడు. ఇందులో కలర్స్ ఉన్న చక్రాన్ని పెట్టారు. దాని మీద ఉన్న బాణం ఏ రంగులో ఆగుతుందో ఆ చీటీని నాగార్జున తీస్తాడు. అందులో ఉన్న క్యారెక్టర్ కు ఎవరు సూట్ అవుతారో చెప్పాల్సి ఉంటుంది. ఇందులో కంటెస్టెంట్ లు ఒకరి పేరు ఒకరు చెప్పుకున్నారు. కొంతమంది తమ మనసులో ఉన్న మాటను ఈ గేమ్ ద్వారా బయట పెట్టేశారు. ఈ ఎఫెక్ట్ సోమవారం నాటి నామినేషన్స్ మీద పడొచ్చని విశ్లేషకులు అంటున్నారు. తర్వాత స్కంద మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ పోతినేని వచ్చాడు. కాసేపు నాగ్ తో కలిసి కంటెస్టెంట్స్ తో గేమ్ ఆడించాడు. దీనిలో మ్యూజిక్ ప్లే చేస్తే పాటను గెస్ చేయాలి. మొత్తం అందరినీ రెండు టీమ్స్ గా విడగొట్టి ఆడించారు. ఇందులో టీమ్ స్కంద గెలిచింది.
ఇలా గేమ్స్ ఆడిస్తూనే ఎమిలినేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు నాగార్జున. అందరూ ఒకొక్కరుగా సేవ్ అవుతూ వచ్చారు. చివరకు దామిని ఎలిమినేట్ అయింది. దామిని వెళ్ళిపోతుంటే ప్రియాంక ఎమోషనల్ అయింది. ఇక మౌస్ లో అందరికీ టాటా చెప్పేసి వచ్చేసిన దామినికి నాగార్జున అందరికీ సలహాలు ఇవ్వమని చెప్పారు. దీంట్లో సందీప్ మరీ స్వార్ధంగా ఆడుతున్నాడని చెప్పింది. అలాగే తేజని వదిలేస్తే బెటర్ ని శోభాశెట్టికి చెప్పింది. శుభశ్రీకి పనులు చేయమని, సేఫ్ గేమ్ ఆడోద్దని తేజకి, నువ్వొక్కడివే కరెక్ట్ అనుకోవద్దని గౌతమ్ కి, అవతలి వాళ్ళ మాట వినమని, అర్ధం చేసుకోమని, తెలుగు నేర్చుకోమిన యావర్ కి చెప్పింది. ఇక శివాజీ విషయం వచ్చేసరికి కొందరికి ఫేవరెట్ గా ఆడుతున్నాడని..అది వదిలేస్తే బెటర్ అని సలహా ఇచ్చింది. శివాజీ విషయంలో ఇది నిజమే అయినా అతను మాత్రం దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. దామినితో వాదన పెట్టుకున్నాడు. ఇంటికెళ్ళి ఇప్పటివరకు జరిగిన అన్ని ఎపిసోడ్స్ చూసి చెప్పు అప్పుడు ఒప్పుకుంటాను అని అన్నాడు. ఈ వాదన అయ్యాక దామిని హైస్ కు, బిగ్ బాస్ కు ఫూనల్ గా గుడ్ బాయ్ చెప్పింది. వెళుతూ వెళుతూ బిగ్ బాస్ మీద తాను రాసిన పాట పాడి వినిపించి వెళ్ళిపోయింది.
ఇక ఈరోజు నుంచి హౌస్ మళ్ళీ శుక్రవారం వరకూ యధావిధిగా కొనసాగుతుంది. ఈరోజు నామినేషన్స్ ఉంటాయి. ఇవి మాత్రం చాలా ఇంట్రస్టింగ్ నడుస్తున్నాయి ఇప్పటివరకు. లాస్ట్ రెండు రోజుల్లో ఒకరి మీద ఒకరు చేసుకున్న ఆరోపణలు, పరిణామలతో ఈ రోజు ఎవరు ఎవరిని ఓట్ చేస్తారో చూడాలి.