Men Thyroid: మహిళలు థైరాయిడ్ సమస్యకు ఎక్కువగా గురవుతారని అందరికీ తెలిసిన విషయమే అయితే పురుషులకు కూడా ఈ సమస్య వస్తుందని వైద్యులు అంటున్నారు. హైపర్ థైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి శరీరానికి అవసరమైన దానికంటే అధికంగా హార్మోన్లను ఉత్పత్తి చేసే పరిస్థితి ఉంటుందని నిపుణులు అంటున్నారు. సకాలంలో చికిత్స చేయకపోతే గుండె, కండరాలు, స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
పురుషులలో హైపర్ థైరాయిడిజం కారణాలు:
గ్రేవ్స్ వ్యాధి పురుషులలో హైపర్ థైరాయిడిజంకు కారణమని నిపుణులు అంటున్నారు. గ్రేవ్స్ సమస్య వస్తే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అలాంటి సమయంలో ఎక్కువ అయోడిన్, దుష్ప్రభావాలను కలిగించే మందులు తీసుకోకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు.
పురుషులలో థైరాయిడ్ లక్షణాలను ఎలా గుర్తించవచ్చు..?
పురుషుల్లో థైరాయిడ్ ఉంటే బరువు తగ్గడం, క్రమరహిత హృదయ స్పందన, భయం, చిరాకు, అలసట, చేతులు వణకడం, చెమటలు పట్టడం, కండరాల బలహీనత, జుట్టు ఊడటం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు.
మహిళలు, పురుషుల్లో ఒకే రకమైన లక్షణాలు ఉన్నా మగవారిలో హైపర్ థైరాయిడిజంలో అంగస్తంభన లోపం, తక్కువ స్పెర్మ్ కౌంట్, అకాల బట్టతల, లైంగిక ఆరోగ్యంపై ప్రభావం ఉంటాయని చెబుతున్నారు. ఈ థైరాయిడ్ హార్మోన్లు పురుషుల వృషణాలలోని కొన్ని కణాల పనితీరును ప్రభావితం చేస్తాయని, స్పెర్మ్ కణాలను ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఈ నాలుగు పౌడర్లు కూరల్లో వేస్తే వ్యాధులు మీ దరిచేరవు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.