ప్రభాస్ లో ఉన్న వయెలెంట్ యాంగిల్ మొత్తాన్ని పిండి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సలార్ మూవీ. ప్రశాంతో నీల్ కేజీఎఫ్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే డైరెక్టర్ ప్రభాస్ తో మూవీ తీస్తున్నాడు అనేసరికి అంచనాలు ఆకాశాన్ని దాటాయి. దానికి తగ్గట్టే మూవీ టీమ్ రిలీజ్ చేసిన టీజర్ కూడా దుమ్ములేపింది. ప్రభాస్‌ను సరిగ్గా చూపించలేదు కానీ…అతని క్యారెక్టర్ కు ఇచ్చిన ఎలివేషన్ తో టీజర్ మోత మోగింది. 24 గంటల్లో 83 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసింది. దీన్ని బట్టి అర్ధంచేసుకోవచ్చు సలార్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో.
ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన మోస్ట్ వయొలెంట్ మ్యాన్ ను డైనోసార్ తో పోలుస్తున్నారు. మామూలుగా అయితే ఈ సినిమా ఈపాటికే రిలీజ్ అయిపోవాలి. కానీ టెక్నికల్ రీజన్స్ వల్ల దీన్ని వాయిదా వేశారు. అప్పటి నుంచి మళ్ళీ కొత్త రిలీజ్ డేట్‌ను ఎప్పుడు ప్రకటిస్తారా తెగ ఆతృతగా చూస్తున్నారు సినీ అభిమానులు. వాళ్ళ నిరీక్షణ ఫలించి మొత్తానికి ఆ రోజు రానే వచ్చేసింది. దిసెంబర్ 22న సలార్ మూవీ విడుదల అవుతుందని ఎక్స్ ప్లాట్ ఫామ్ లో ప్రకటించింది మూవీ టీమ్. దీంతో ప్రభాస్ అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. మూవీ డేట్ రిలీజ్ నేపథ్యంలో సోషల్ మీడియాలో మూడు హ్యాష్ ట్యాగ్ లు ట్రెండింగ్ లోకి వచ్చాయి. వాటిల్లో ఎక్స్ లో వచ్చిన సీజ్ ఫైర్ అన్నింటికన్నా ఎక్కువ హవా నడిపిస్తోంది.
ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఇంకా టిన్ను ఆనంద్, జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీని హోంబలే నిర్మాణ సంస్థ నిర్మించింది.
𝐂𝐨𝐦𝐢𝐧𝐠 𝐁𝐥𝐨𝐨𝐝𝐲 𝐒𝐨𝐨𝐧!#SalaarCeaseFire Worldwide Release On Dec 22, 2023.#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms #VijayKiragandur @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur @shivakumarart @vchalapathi_art @anbariv… pic.twitter.com/P3KryJm7Ug
— Salaar (@SalaarTheSaga) September 29, 2023
ఇవి కూడా చదవండి:గన్నులు పేలుతున్నాయి…స్వర్ణాలు వస్తున్నాయ్
గుడ్‌న్యూస్..భారీగా పడిపోయిన బంగారం ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..!!