hit and run law
No Petrol :పెట్రోల్ అయిపోయింది… గుర్రం మీద డెలివరీ
Delivery on Horse : హిట్ అండ్ రన్(Hit and Run) కొత్త యాక్ట్ ప్రజల తల ప్రాణం తోకకు తెస్తోంది. దీనికి వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు(Truck Drivers) సమ్మె చేయడం ఏమో కానీ నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ దొరక్క జనాలు మాత్రం తెగ ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి నుంచి పెట్రోల్ బంకులు ముందు పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్‌లో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ కూడా పాపం ఇలాగే నానాపాట్లు పడ్డాడు. పెట్రోల్ కోసం నాలుగు గంటలు క్యూ లైన్లో నిల్చున్నాడు. అయినా పెట్రోల్ దొరకలేదు. దీంతో విసుగుచెంది ఏకంగా గుర్రం మీద ఫుడ్ డెలివరీ(Delivery on Horse) చేయడానికి వెళ్ళాడు.
Also Read:జపాన్‌లో 62కు చేరుకున్న మృతుల సంఖ్య
చంచల్ గూడలో గుర్రం మీద ఫుడ్ డెలివరీ చేయడానికి వెళతున్న వ్యక్తి అక్కడ అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు కాస్తా వైరల్ గా మారింది. సూపర్ ఐడియా అని కొందరు మెచ్చకుంటున్నారు. మరికొందరు డెలివరీ బాయ్ డెడికేషన్‌కు ముచ్చటపడుతున్నారు. మరోవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్న డెలివరీ బాయ్స్ మాత్రం ఎంచక్కా ఏ ఇబ్బందులూ పడకుండా తమపని తాము చేసుకుని వెళ్ళిపోయారు.
నిన్న కేంద్ర ప్రభుత్వం డ్రైవర్ల అసోసియేషన్‌తో జరిపిన చర్చలు సక్సెస్ అవడంతో వారు సమ్మెను విరమించారు. దీంతో నిన్న సాయంత్రమే ట్రక్కులు అన్నీ బయలుదేరాయి. ఈరోజు ఉదయం ఎలా అయినా అవి గమ్యస్థానాలకు చేరతాయి. దీంతో రాత్రితో పోల్చుకుంటే.. పెట్రోల్ బంకుల దగ్గర ప్రస్తుత పరిస్థితులు నిలకడగా ఉన్నాయి.
#Hyderabadi Bolte kya samjhe re tum log gaan.
Tum petrol close kardo hum horse lakar nikal jate
Zomato Delivery boy came out to deliver food on horse at #Chanchalguda near to imperial hotel.#ZomatoMan #DeliversOnHorse pic.twitter.com/l0uq1Befk6
— Hassan🔻𝕏 (@HassanSiddiqei) January 2, 2024
Explainer: ‘హిట్-అండ్-రన్’ నిబంధన ఏంటి..? డ్రైవర్ల ఆందోళన ఎందుకు?
కేంద్ర ప్రభుత్వం కొత్తగా హిట్ అండ్ రన్ చట్టం (Hit and Run Law) తీసుకుని వచ్చిన విషయం తెలిసిందే. ఇండియన్ పీనల్ కోడ్ (IPC) ను మారుస్తూ కొత్త న్యాయసంహిత అనే చట్టాన్ని అమలులోకి తీసుకొస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని తాలూకా బిల్లు కూడా పార్లమెంటులో ఆమోదం పొందింది. అయితే ఇప్పుడు ఇందులో నిబంధనలు కొన్ని తమకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ ట్రక్ యజమానులు, డైవర్లు ఆందోళనకు దిగారు.
మరి కొద్ది రోజుల్లో ఈ చట్టం దేశ వ్యాప్తంగా అమ్మల్లోకి రానుంది. ఈ రూల్ కి వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు , బస్సు డ్రైవర్లు (Drivers) ఆందోళనకు (Protest)దిగి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కొత్త చట్టంలో ఉన్న శిక్ష, జరిమానా పై డ్రైవర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
జైలు శిక్ష, జరిమానా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. మోదీ సర్కారు వైఖరికి నిరసనగా దేశ వ్యాప్తంగా ఆందోళనకు దిగడంతో ట్రక్కులు, లారీలు ఎక్కడికక్కడ రోడ్ల మీదే నిలిచిపోయాయి. దీంతో పెట్రోల్ బంక్ ల ముందు పెద్ద పెద్ద క్యూ లైన్లు దర్శనమిచ్చాయి.
ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఎక్కడి వాహనాలు అక్కడిక్కడే నిలిచిపోయాయి. ఇక ఎప్పుడూ బిజీ గా ఉండే హైదరాబాద్ నగరంలో అయితే కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రతి ఏరియాలో ఇదే పరిస్థితి నెలకొంది. డ్రైవర్స్ ధర్నా కారణంగా పెట్రోల్, డీజిల్ దొరకదేమో అన్న భయంతో ప్రజలు ఒక్కసారిగా ఫ్యూయెల్ సెంటర్లకు బారులుతీరారు. దీంతో అన్ని ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
అటు మియాపూర్ నుంచి ఇటు ఎల్బీనగర్ వరకు.. ఇటు మెహిదీపట్నం నుంచి అటు సికింద్రాబాద్ వరకు ఎక్కడ చూసినే ఇదే పరిస్థితి. బండి ముందుకు కదిలితే ఒట్టు అన్నట్లుగా ఉంది. గచ్చిబౌలి, ఐకియా జంక్షన్, కొండాపూర్ ఏరియాల్లోనైతే అడుగు తీసి అడుగు పెట్టలేని స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అందుకే.. ఆయా రూట్లలో వాహనదారులు బయటకు రావొద్దని సూచిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.
అసలు డ్రైవర్లు ఈ చట్టాన్ని అంతలా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..ఆ చట్టంలో ఏముంది అంటే.. భారతీయ న్యాయసంహిత ప్రకారం హిట్ అండ్ రన్ కేసులో ట్రక్కు డ్రైవర్లకు భారీ శిక్ష పడుతుంది. దీంతో పాటు యాక్సిడెంట్లకు కారణమైతే విధించే పెనాల్టీని కూడా అధికంగా పెంచేశారు.
ఈ కేసులో డ్రైవర్ కానీ దోషి అని తేలితే కనుక పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉన్నట్లు చట్టంలో ఉంది. అంతేకాకంఉడా సుమారు 7 లక్షల జరిమానా విధించేలా ఈ కొత్త చట్టంలో మార్పులు కూడా చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఐపీసీ చట్టంలో హిట్ అండ్ రన్ కేసులో కేవలం రెండేళ్ల శిక్ష మాత్రమే ఉంది.
కానీ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం, ర్యాష్ డ్రైవింగ్ ల వల్ల కొత్త చట్టంలో ఏడేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా తో పాటు పదేళ్ల శిక్షను కూడా పెంచడంతో పాటు 7 లక్షల జరిమానా విధిస్తారు. దీంతో ఈ కొత్త చట్టం గురించి డ్రైవర్లు తీవ్ర ఆందోళన వ్యకత్ం చేయడంతో పాటు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇది భారీ వాహనాలకు వ్యతిరేకంగా ఉందని తెలపడంతో పాటు శిక్ష పెంచడాన్ని, జరిమానాను పెంచడాన్ని కూడా డ్రైవర్లు తప్పుపడుతున్నారు. ఇలా చేయడం వల్ల కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారు కూడా వాహనాలు నడపడానికి ఆసక్తి చూపరని డ్రైవర్లు అంటున్నారు.
కొన్ని సందర్భాల్లో ప్రమాదం జరిగిన ప్రదేశాల్లో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ కూడా అక్కడ ఉన్న స్థానికులు కొందరు తమ పై దాడులకు తెగబడతారని వివరించారు. ఈ క్రమంలో చట్టంలో మార్పు చేయాలంటూ ట్రక్, ప్రైవేట్ బస్సులు, క్యాబ్ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు.
Also read: ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం!