Insult to Dalit Woman In Court : దేశంలో దళితులంటే చిన్నచూపు మరీ ఎక్కువైపోతోంది. వాళ్ళమీద చేస్తున్న ఆగడఆలు, అవమానాలకు లెక్క లేకుండా పోతోంది. తాజాగా రాజస్థాన్‌లో(Rajasthan) జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్యర్చానికి గురి చేస్తోంది. రాజస్థాన్‌లో ఓ దళిత యువతి(Dalit Woman) అత్యాచారానికి(Rape) గురైంది. ఆ తరువాత న్యాయం కోసం కోర్టుకు వెళితే అక్కడ కూడా ఘోర అవమానం జరిగింది. తనకు అన్యాయం జరిగిందంటూ మహిళ కోర్టును ఆశ్రయిస్తే.. బట్టలు విప్పి గాయాలను చూపించాలని మేజిస్ట్రేట్ కోరారు. దీంతో సదరు మహిళతో పాటూ అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు.
పోలీసుల అదుపులో మెజిస్ట్రేట్…
తప్పుడు పనులు చేస్తే చట్టానికి ఎవ్వరైనా ఒక్కటే. మేజిస్ట్రేట్ చేసిన దానికి మహిళ వెంటనే అక్కడే ఉన్న హిండైస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మెజిస్ట్రేట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బాధితురాలి మీద మార్చి 19న అత్యాచారం జరిగిందని.. దాని మీద అదే నెలలో 30వ తేదీన హిండౌస్ కోర్టు(Hindol Court) లో విచారణ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. మెజిస్ట్రేట్ చేసిన పని ఎంత మాత్రం సరైనది కాదని అంటున్నారు. అతడికి గట్టి శిక్ష పడే అవకాశం ఉందని చెబుతున్నారు. మెజిస్ట్రేట్‌ను విధుల నుంచి తొలగించడమే కాకుండా బార్ కౌన్సిల్ నుంచి తొలగించే అవకాశం కూడా ఉందని అంటున్నారు.
Also Read : Telangana : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్ల వల..టికెట్ కోసం డబ్బులివ్వాలని ఫోన్లు