Hina Khan: బాలీవుడ్ బుల్లితెర నటి హీనా ఖాన్ క్యాన్సర్తో పోరాడుతోంది. ఇటీవలే తాను స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ బాధపడుతున్నట్లు అభిమానులతో పంచుకుంది. అప్పటి నుంచి హీనా ఖాన్ తన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతీ అప్డేట్స్ సోషల్ మీడియాలో చేస్తూనే ఉంది.
జుట్టు కత్తిరించిన హీనా ఖాన్
అయితే తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించి హీనా ఖాన్ షేర్ చేసిన వీడియో అందరి కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. క్యాన్సర్లో కీమోథెరపీ సమయంలో జుట్టు రాలడం వల్ల హీనా తన పొడవాటి జుట్టును కత్తిరించుకుంది. ఈ సమయంలో ఇది చూసిన ఆమె తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోను హీనా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో హీనా తన తల్లిని ఏడవవద్దని చెబుతూ భావోద్వేగానికి గురవుతుంది. జుట్టు మళ్ళీ వస్తుంది. నువ్వు కూడా చాలాసార్లు జుట్టు కత్తిరించుకునే ఉంటావు అని తల్లికి దైర్యం చెప్పింది.
View this post on Instagram
సొంత జుట్టుతో విగ్
హీనా ఖాన్ తన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చింది.. “ఈ క్యాన్సర్ యుద్ధంలో గెలవడానికి నేను ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటాను. నా వెంట్రుకలు దానంతటవే రాలిపోకముందే తీసేయాలని అనుకున్నాను. నా నిజమైన కిరీటం నా విశ్వాసం, నాపై నాకున్న ప్రేమ. అందుకే నా జుట్టు తీసేయడానికి నిర్ణయించుకున్నాను. ఈ దశలో నా స్వంత జుట్టుతో ఒక విగ్ తయారు చేయించుకొని దానిని ఉపయోగించుకుంటాను. ఈ సమయంలో నా వాళ్ళు నాకు తోడుగా ఉన్నారు అని రాసుకొచ్చింది.”
Also Read: Actor Suhas: “జనక అయితే గనక”.. మరో కొత్త కథతో వచ్చేస్తున్న సుహాస్ – Rtvlive.com