Kiss day: ప్రపంచవ్యాప్తంగా ఈ ఫిబ్రవరి 13న కిస్ డే ను లవర్స్, కపుల్స్, ఫ్రెండ్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా రేపు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా యువతీ యువకులు పెద్ద ఎత్తున్న సంబరాలు మొదలుపెట్టారు. అయితే ముద్దుకు ఒక ప్రత్యేక చరిత్ర ఉండగా.. లాంగెస్ట్ ఫస్ట్ కిస్ సీన్ భారతీయ సినిమాలోనే, ఇద్దరు దంపతుల మధ్య తెరకెక్కించారనే విషయం చాలామందికి తెలియదు. ఇంతకు అది ఏ సినిమా? ఎవరు తెరకెక్కించారు? నటీనటులేవరో తెలుసుకుందాం.
నాలుగు నిమిషాల పాటు..
నిజానికి టాకీల యుగం ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశంలో తెరపై ముద్దు సన్నివేశాలున్నట్లు ఆధారాలున్నాయి. కానీ బాలీవుడ్లో తెరపై బహిరంగంగా కిస్ సీన్స్ కర్మ సినిమాతోనే మొదలయ్యాయని చెప్పొచ్చు. భారతీయ సినిమాలో మొట్టమొదటి ఆన్-స్క్రీన్ (On screen) ముద్దుగానే కాదు పరిశ్రమలోనూ లాంగెస్ట్ కిస్ గా ఈ సన్నివేశం ప్రత్యేకంగా నిలిచిపోయింది. 1933లో లండన్ నుంచి తిరిగి వచ్చిన చిత్రనిర్మాత, నటుడు హిమాన్షు రాయ్ (Himanshu Rai) ‘కర్మ’ అనే చిత్రాన్ని రూపొందించారు. ఇందులో హీరోగా అతనే ప్రధాన పాత్ర పోషించగా.. అతని భార్య దేవికా రాణి (Devika rani) హీరోయిన్గా నటించింది. ఇదే భారతీయ చలనచిత్రంలో వారి అరంగేట్రం కావడం విశేషం. కాగా ఈ చిత్రంలో భార్యాభర్తల మధ్య ముద్దుల సన్నివేశం నాలుగు నిమిషాల పాటు సాగింది. ఇప్పటి వరకు భారతీయ సినిమాల్లోనే అత్యంత సుదీర్ఘమైన ముద్దు సన్నివేశం ఇదే రికార్డుగా మిగిలిపోయింది. ఒక రకంగా ఆ దృశ్యం ప్రపంచవ్యాప్తంగా మొదటిదిగా పేర్కొంటారు సినీ ప్రముఖులు.
ఇది కూడా చదవండి : Body shaming: బుమ్రా భార్య శరీరాకృతిపై ట్రోలింగ్.. తిప్పికొట్టిన సంజన
నటుడితో లేచిపోయిన దేవికా రాణి..
1930లో దేవికా రాణి భారతదేశంలో స్టార్ నటిగా ఎదిగింది. అయితే ఆమె భర్త రాయ్ నిర్మాణంలో పలు సినిమాల్లో నటించి శక్తివంతమైన వ్యక్తిగానూ మారింది. అయితే 1936లో రాయ్ ‘జీవన్ నయ్యా’ అనే సినిమా చిత్రీకరిస్తున్నప్పుడు అందులో హీరోగా నటించిన నజ్మ్-ఉల్-హసన్‌పై దేవిక మనసు పడింది. ఇద్దరు నటులు సినిమాను మధ్యలోనే వదిలేసి లేచిపోయారు. ఈ సంఘటనతో విసుగు చెందిన హిమాన్షు రాయ్.. దేవికతో సోదర బంధాన్ని కలిగి ఉన్న తన సౌండ్ ఇంజనీర్ శషధర్ ముఖర్జీని పంపించి ఆమెను తిరిగి రప్పించాడు. అయితే దేవిక వారికి పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తేనే వస్తానని డిమాండ్ చేసింది. రాయ్ ఈ నిబంధనలకు అంగీకరించాడు. కానీ తర్వాత నజ్మ్-ఉల్-హసన్‌ను సినిమా అవకాశాలు రాకుండా చేసి అతనికి కెరీర్ లేకుండా చేశాడు.