Viral Video : రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) స్టార్ ప్లేయర్ రియాన్ పరాగ్ (Riyan Parag) కు సంబంధించి ఓ బ్యాడ్ న్యూస్ వైరల్ అవుతోంది. తన యూట్యూబ్ ఛానల్ లైవ్‌తో ఈ యువ ఆటగాడు చిక్కుల్లో పడ్డాడు. యూట్యూబ్ (YouTube) లో హీరోయిన్ల హాట్ వీడియోలు వెతుకుతున్న సెర్చింగ్ వివరాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హీరోయిన్ల హాట్ వీడియోలు (Heroines Hot Videos) సెర్చ్ చేస్తున్నాడంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. యూట్యూబ్ సెర్చ్ హిస్టరీలో అభ్యంతరకరమైన కంటెంట్ ఉండడంతో పరాగ్ ట్రోలర్లకు అడ్డంగా దొరికాడు. అనన్యా పాండే.. సారా అలీఖాన్ హాట్ వీడియెలు అని టైప్ చేసిన సెర్చ్ చేసినట్లు పరాగ్ ఖాతాలో కనిపించింది. పరాగ్ తన పర్సనల్ సెర్చ్ ఇంజిన్ హైడ్ చేయకపోవడంతో వచ్చిన సమస్య ఇది. లైవ్ స్ట్రీమ్ చేస్తున్న క్రమంలో అవి బయటపడడంతో నెటిజన్లు స్క్రీన్ షాట్లు తీసి మరి, పరాగ్ భాగోతాన్ని బయట పెట్టే ప్రయత్నం చేసారు. నెట్టింట ఇది వైరల్ గా మారింది. పరాగ్ తీరుపై రకరకాల కామెంట్లు కనిపిస్తున్నాయి. ఇతడు క్రికెట్ ఆటలోనే కాదు..ఆ ఆటలో కూడా స్పెషలిస్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి వీటిపై పరాగ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
Search history of riyan Parag
“Sara ali khan hot”
“Virat Kohli”
“Ananya Pandey Hot” pic.twitter.com/CW49IwqldH
— ً (@KohliMyHeart) May 27, 2024
Also Read : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బిగ్ షాక్