Rana as the villain to face Megastar: మెగాస్టార్ చిరంజీవి తన 156వ సినిమాను శ్రీవశిష్ఠ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ రోజునే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఇది సోషియా ఫాంటసీ జోనర్లో నడిచే కథ. ఈ తరహా కథలను తెరకెక్కించడం పెద్ద బ్యానర్ల వల్లనే అవుతుంది. అందువల్లనే యూవీ బ్యానర్ వారు ముందుకు వచ్చారు.
And here goes .. https://t.co/RTzgdZxhAu
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 24, 2023
ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనుష్క .. నయనతార పేర్లు వినిపించాయి. కథానాయికల సంగతి అటుంచితే, ప్రతినాయకుడిగా ఎవరు కనిపించనున్నారనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ‘రానా’ పేరు వినిపిస్తూ ఉండటం విశేషంగా మారింది.
విలన్ గా తానేంటో బహుబలి మూవీతో నిరూంపించుకున్నాడు రానా. పాన్ ఇండియా ఇమేజ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. పవర్ఫుల్ విలనిజాన్ని పండించడంలో ఆయనకి మంచి అనుభవం ఉంది. అందువలన శ్రీవశిష్ఠ ఆయనను సంప్రదించినట్టుగా .. రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ తరువాత చిరంజీవి చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ఇదే కావడం .. విలన్ గా రానా పేరు వినిపిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.