Jyothika: కొంత మంది సినీ ప్రియులకు హీరో, హీరోయిన్స్ పట్ల ఇష్టాలకు హద్దే ఉండదు. వారి పేరు చివరన తమ అభిమాన హీరోల పేరును తోకగా పెట్టుకోనే సోషల్‌మీడియా యూజర్లు అనేకం ఉంటారు. ఆ రేంజ్లో అభిమానిస్తారు. ఇక ఇటీవలి కాలంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా స్టార్స్ సోషల్ మీడియాలో తమ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు. అయితే తాజాగా హీరోయిన్, స్టార్ హీరో సూర్య భార్య జ్యోతిక సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో చిట్చాట్చేశారు. ఈ క్రమంలో జ్యోతికను ఓ అభిమాని అడిగిన ప్రశ్న.. అందుకు ఆమె ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారాయి.
Also Read: Ketika Sharma: బీచ్ అందాలతో పోటీపడుతున్న హాట్ బ్యూటీ కేతిక.. వైరలవుతున్న ఫొటోలు..!
మీ భర్తను అప్పుగా ఇవ్వండి.. జ్యోతికకు అభిమాని ప్రశ్న
ఇటీవలే విడుదలైన ‘సైతాన్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని మంచి జోష్ మీద ఉన్నారు జ్యోతిక. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలో జ్యోతికను ఓ అభిమాని అడిగిన అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘మేడమ్.. సూర్యగారిని ఒక రోజు నాకు అప్పుగా ఇస్తారా.. నేను పదిహేను సంవత్సరాల నుంచి ఆయనకు వీరాభిమానిని.. ప్లీజ్ మేడమ్” అంటూ కామెంట్ పెట్టింది. దీనికి జ్యోతిక చాలా సున్నితంగా బదులిచ్చింది. “అది మాత్రం కుదరద” అని సమాధానం చెప్పింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Actress Anjali: విడాకులు తీసుకున్న నిర్మాతతో.. హీరోయిన్ అంజలి పెళ్లి?