Chiranjeevi – Srikanth : టాలీవుడ్(Tollywood) మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), నటుడు శ్రీకాంత్(Srikanth) మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శంకర్ దాదా MBBS సినిమాతో వీరి స్నేహం అన్నదమ్ముల బంధంగా మారింది. శ్రీకాంత్ కు కూడా చిరంజీవి అంటే విపరీతమైన అభిమానం ఈ విషయాన్నీ చాలా సందర్భాల్లో ఆయనే చెప్పుకొచ్చారు. అంతే కాదు శ్రీకాంత్ పిల్లలు కూడా చిరంజీవిని పెదనాన్న అని పిలుస్తుంటారు.
Also Read : Actress Anjali: విడాకులు తీసుకున్న నిర్మాతతో.. హీరోయిన్ అంజలి పెళ్లి?
శ్రీకాంత్ ఇంటికి వెళ్లిన మెగాస్టార్
అయితే తాజాగా శ్రీకాంత్ పుట్టినరోజు(Birthday) సందర్భంగా స్వయంగా అతని ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్ . కేక్ కట్ చేయించిన తర్వాత కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఇంట్లో ఉన్న పలు అవార్డులను చూసుకుంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. శ్రీకాంత్ కుమారుడు రోషన్(Roshan) తో కూడా కాసేపు ముచ్చటించారు చిరంజీవి. ఇందుకు సంబంధించిన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ చిరంజీవి, శ్రీకాంత్ కాంబోలో మళ్ళీ సినిమా చూడాలని ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్నారు. ‘బింబిసారా’ మూవీ ఫేమ్ వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోషియో ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. స్టార్ హీరోయిన్ త్రిష కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది 2025 లో సంక్రాంతి కానుకగా మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Chiranjeevi Celebrate The Actor Srikanth Birthday His Residency@KChiruTweets @actorsrikanth #ActorSrikanth #Chiranjeevi #BirthdayCelebration #TeluguNews #LatestNews #RTV pic.twitter.com/8XNHYnofbz
— RTV (@RTVnewsnetwork) March 24, 2024
Also Read : Ketika Sharma: బీచ్ అందాలతో పోటీపడుతున్న హాట్ బ్యూటీ కేతిక.. వైరలవుతున్న ఫొటోలు..!