హీరోయిన్ అమలా పాల్ ‘యెస్’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుట్టిన రోజు నాడు తన స్నేహితుడు ఇచ్చిన లైఫ్ లాంగ్ గిఫ్ట్ కు అమలా యెస్ చెప్పారు. అమలా పాల్, ఆమె ఫ్రెండ్ జగత్ దేశాయ్ ప్రేమను, ప్రపోజల్ ను ఒప్పుకున్నారు. పెళ్ళి చేసుకుంటావా అని అడిగితే ముద్దు పెట్టి మరీ యెస్ చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నా కలల రాణి నాకు ఎస్ చెప్పిందంటూ #Weddingbells హ్యాష్ ట్యాగ్ తో జగత్ ప్రపోజల్ వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. దాంతో పాటూ అమలా పాల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు.
Also Read:బాప్ ఆఫ్ ఛార్ట్ కు షాక్,17.2 కోట్లు వెనక్కి తిరిగివ్వాలన్న సెబీ..కారణం ఇదే
కేరళకు చెందిన అమలా పాల్ మలయాళీ సినిమాలతో వెండితెరకు పరిచయం అయ్యారు. బెజవాడ ఆమె మొట్టమొదటి తెలుగు సినిమా. దీని తర్వాత లవ్ ఫెల్యూర్, నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాై కపిరాజు మూవీస్ పేరు తెచ్చుకున్నారు. అమలా పాల్ తెలుగు, తమిళ, మలయాళీ సినిమాలు చేశారు. కొన్ని వెబ్ సీరీస్ లలో కూడా నటించారు. కెరీర్ మంచి పీక్ లో ఉన్న టైమ్ లో మలయాళం దర్శకుడు ఎ. ఎల్ విజయ్ ను పెళ్ళి చేసుకున్నారు. అయితే వీరిద్దరి బంధం ఎక్కవు కాలం నిలువలేదు. కొన్ని రోజుల్లోనే పరస్పర అంగీకారంతో 2017లో వీరు విడిపోయారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు అమలా పాల్ ఒంటరిగానే ఉన్నారు. సినిమాలు, వెబ్ సీరీస్ లు చేస్తూ కెరీర్ ను కాపాడుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తన స్నేహితుడు జగత్ దేశాయ్ ను పెళ్ళి చేసుకోబోతున్నారు.
View this post on Instagram