కర్ణాటక రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఉత్తర కన్నడ జిల్లాలో ఈరోజు కురిసిన భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారిపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఉత్తర కన్నడ జిల్లాలో జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీపై ఆ పక్కన ఉన్న ఓ ఇంటి పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఓకే కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులతో సహా ఏడుగురు చనిపోయారు. దీంతో సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది కొండ చరియలు కింద ఉన్న మృతదేహాలను వెలికితీశారు.