Sudheer Babu’s Harom Hara Trending in Amazon Prime OTT : టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు రీసెంట్ గా ‘హరోం హర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రూరల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. సినిమా చూసిన చాలామంది ఇన్నాళ్లకు సుధీర్ బాబు కటౌట్ తగ్గ సినిమా పడిందని అన్నారు. అందుకు తగ్గట్లు గానే సుధీర్ బాబు సినిమాలో తన ఊరమాస్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసాడు.
కుప్పం బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా జూన్ 14న థియేటర్లలోకి వచ్చింది. ‘పుష్ప’, ‘కేజీఎఫ్’ లాంటి చిత్రాలని పోలినట్లు ఉందని టాక్ రావడం వల్ల ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకే కమర్షియల్ గా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఓటీటీలో మాత్రం అదరగొడుతుంది. ఇటీవలే ఈ సినిమా ఏకంగా మూడు ఓటీటీల్లో రిలీజ్ అయింది.
ఈటీవీ విన్, ఆహాలతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విశేష ఆదరణ సొంతం చేసుకొని టాప్-1 లో నిలిచింది. దేశవ్యాప్తంగా టాప్-1లో ఉన్నట్లు తెలుపుతూ అమెజాన్ ఓ పోస్టర్ను విడుదల చేసింది. జ్ఞానసాగర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మాళవికా శర్మ హీరోయిన్ గా నటించగా.. సునీల్, జయప్రకాష్, రవి కాలే తదితరులు కీలక పాత్రలు పోషించారు.