Kolkata Doctor Murder: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాలో ఆర్జీ కార్ వైద్య కళాశాలలో ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి పై హత్యాచార ఘటనను నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా కొన్ని రకాల వైద్యసేవలను నిలిపివేస్తున్నట్లు ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ విషయం గురించి కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు ఆదివారం ఫోర్డా లేఖ రాసింది. ఈ ఘటన గురించి సీబీఐతో దర్యాప్తు చేయించాలని కేంద్ర సహాయ మంత్రి సుకాంత మజుందార్ డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే ఈ హత్యాచార ఘటనలో అరెస్ట్ అయిన సంజయ్ రాయ్ పోలీసులకు అనుబంధ వాలంటీర్ గా పని చేస్తున్నట్లు తెలిసింది. దక్షిణ కోల్ కతాలోని శంభునాథ్ పండిట్ వీధిలో ఉండే సంజయ్…స్థానిక పోలీస్ విభాగంలో విపత్తుల నిర్వహణ బృందంలో వాలంటీర్ గా చేరాడు.
అతనికి ఆర్జీ కార్ వైద్య కళాశాల , హస్పిటల్ చెక్‌పోస్టు బాధ్యతలను అప్పగించారు. ఈ ఘటన గురించి దర్యాప్తు చేస్తున్న సమయంలో ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోగా..తనను ఉరి తీయాలనుకుంటే తీసుకోండి అంటూ అధికారులకు ఎదురు చెప్పినట్లు సమాచారం.