Jabardasth Comedian : స్టార్ సెలెబ్రిటీ(Star Celebrities) లే కాదు ఈ మధ్య బుల్లితెర సెలెబ్రిటీలు సైతం రిచ్ లైఫ్(Rich Life) ని లీడ్ చేస్తున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్స్ అయితే ఇళ్ళు కొనుగోలు చేయడం దగ్గరి నుంచి లగ్జరీ కార్లు కొంటూ తాము కూడా స్టార్స్ కంటే తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ఇప్పటికే చాలామంది కమెడియన్స్ సొంతంగా ఇళ్ళు కట్టుకొని, కార్లు కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్ లో మరో జబర్దస్త్ కమెడియన్ చేరాడు. అతను మరెవరో కాదు మన ‘గల్లీ బాయ్’ భాస్కర్(Gully Boy Bhaskar).
కొత్త ఇంట్లో అడుగుపెట్టిన భాస్కర్
‘పటాస్’ షో తో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు భాస్కర్. ఆ తర్వాత ‘అదిరింది’ షోలో సద్దాం హుస్సేన్, యాదమ్మ రాజులతో కలిసి స్కిట్స్ చేసాడు. అక్కడితో ‘గల్లీ బాయ్’ భాస్కర్ గా ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం జబర్దస్త్ షోలో కమెడియన్ గా చేస్తున్న ఇతను సొంతంగా ఓ ఇంటిని నిర్మించుకున్నాడు. తాజాగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియా(Social Media) లో పోస్ట్ చేస్తూ.. ఫైనల్ గా నా డడ్రీమ్ హౌజ్ కట్టుకున్నానని తన ఆనందాన్ని వ్యక్త పరిచాడు.
మూడు అంతస్థుల బిల్డింగ్
కమెడియన్ భాస్కర్ కొత్త ఇల్లు ఏకంగా మూడు అంతస్థులతో నిర్మితమై ఉంది. దీన్ని నిర్మించడానికి గట్టిగానే ఖర్చు అయినట్లు బిల్డింగ్ ని చూస్తే అర్ధమౌవుతుంది. కాగా భాస్కర్ కొత్తింటి గృహ ప్రవేశానికి తోటి కమెడియన్స్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం భాస్కర్ పోస్ట్ చేసిన తన కొత్త ఇంటి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
View this post on Instagram