Gujarat Rains: గుజరాత్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 9 జిల్లాలను వానలు ముంచెత్తుతున్నాయి. కచ్, జామ్నగర్, ద్వారక, పోర్బందర్, రాజ్కోట్, జునాగఢ్, గిర్సోమ్నాథ్, నవ్సారి, వల్సాద్లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై భారీగా వరదనీరు చేరుకున్నాయి. జలదిగ్బంధంలో పలు కాలనీలు ఉన్నాయి. ఐతే మరో వారం పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భరూచ్, డాంగ్, నవ్సారి, వల్సాద్ భావ్నగర్లలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది.