Abhaya hastam:రేవంత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గృహలక్ష్మి పథకం రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటివరకు జిల్లా కలెక్టర్లు లబ్ధిదారులకు ఇచ్చిన, మంజూరు చేసిన పత్రాలను సైతం రద్దు చేస్తామని చెప్పింది. ఇది షాకింగ్ న్యూసే అయినా గృహలక్ష్మి స్థానంలో అభయ హస్తం ఇస్తామని చెబుతోంది. దీనిద్వారా సొంత స్థలం ఉన్నవాళ్లకు రూ. 5లక్షల సాయం చేస్తామని అంటోంది. కేసీఆర్ హయంలో వచ్చిన గృహలక్ష్మి పథకం కింద 3లక్షలు మాత్రమే సాయం వచ్చేది. ఇప్పుడు దాన్ని పెంచుతూ అభయహస్తం ద్వారా 5లక్షలు ఇస్తామని హామీ ఇస్తంది కాంగ్రెస్ ప్రభుత్వం.
Also Read:టీడీపీలో చేరనున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బామ్మర్ధి
ఎన్నికల ముందునాటికి 15లక్షల గృహలక్ష్మి దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి. ఇందులో 2లక్షల మందికి పత్రాలు కూడా మంజూరు చేశారు. అయితే ఇప్పుడు అవన్నీ కూడా కాన్సిల్ చేసేస్తున్నారు. దీంతో గత ప్రభుత్వం మంజూరు చేసిన లబ్ధిదారులకు మాత్రం షాక్ తగిలినట్టు అయింది. ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ కొత్తగా దరఖాస్తులను పెట్టుకోవల్సిందే. ఇంటిసాయం కోసం అంతా మళ్లీ అప్లయ్ చేసుకోవాల్సిందే.