Mumbai : ముంబై లోకల్ రైలు(Mumbai Local Train) లో విషాద సంఘటన చోటుచేసుకుంది. టిట్వాలా, వసింద్ రైల్వే స్టేషన్ల మధ్య ఘోర మర్డర్(Murder) జరిగింది. వివాహ విందుకు వెళ్లి వస్తున్న యువకులు మద్యం మత్తులో 55 ఏళ్ల ప్రయాణికుడిని దారుణంగా హతమార్చారు. షాహాపూర్ తాలూకాలోని సజీవలి గ్రామానికి చెందిన దత్తాత్రయ్ భోయిర్ అనే రైతు చికిత్స పొందుతూ మృతి చెందగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
#WATCH | #Maharashtra: 55-Year-Old Dies After Four Men Attack On Train With Knife, Belt
By @Yourskamalk pic.twitter.com/ca6JvulBzP
— Free Press Journal (@fpjindia) May 5, 2024
Also Read : 8వ తరగతి బాలుడిపై లైంగిక దాడి.. పురుషాంగంలో అవి చొప్పించి దారుణం!
ఈ దాడి ఏప్రిల్ 28న జరిగగా ఆలస్యంగా వెలుగులోకి రాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆదివారం సోషల్ మీడియా(Social Media) లో వైరల్ కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. నాలుగు నిమిషాల వీడియోలో కొంతమంది యువకుడు వృద్ధుడిపై దాడి చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. కదులుతున్న లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న యువకులు సరదాగా జోకులు వేసుకుంటూ అతిగా ప్రవర్తించారు. దీంతో పక్కన కూర్చున్న ప్రయాణికుడిపై కూడా జోకులు వేయడంతో అతను మందలించాడు. దీంతో ఆగ్రహానికి గురైన యువకులు కత్తి & బెల్ట్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో స్థానికులు సాయంతో ఆస్పత్రిలో చేరిన షాహాపూర్ తాలూకాలోని సజీవలి గ్రామానికి చెందిన దత్తాత్రయ్ భోయిర్ అనే రైతు మృతి చెందాడు.
ఈ సంఘటనను ధృవీకరిస్తూ గవర్నమెంట్ రైల్వే పోలీస్(GRP) సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ..గాయపడిన భోయిర్‌ను మొదట వాసింద్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. తరువాత అతని పరిస్థితి విషమంగా ఉండటంతో అసన్‌గావ్‌లోని క్రిస్టల్ ఆసుపత్రికి ఆపై థానేలోని మరొక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ప్రభుత్వ రైల్వే పోలీసుల నివేదికల ప్రకారం.. మద్యం సేవించడం వల్ల గొడవకు దారితీసిందని చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.