షారూఖ్ పనైపోయింది అనుకున్నారు. పెద్దవాడు అయిపోయాడు..ఇక సినిమాలు చేయలేడు అనుకున్నారు. అంతేకాదు బాలీవుడ్ మార్కెట్ కూడా పడిపోయిందని కామెంట్లు చేశారు. టాలీవుడ్ సినిమాలు రాజ్యమేలుతుంటే…హిందీ ఇండస్ట్రీ చూస్తూ కూర్చోవలసిందే అన్నారు. కానీ వారందరికీ చెక్ పెట్టాడు బాలీవుడ్ కింగ్. పవర్ ఫుల్ కమ్ బ్యాక్ తో రావడమే కాకుండా…బాలీవుడ్ కి కూడా జీవం పోశాడు. రెండు సినిమాలతో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకునేలా చేశాడు. పటాన్ మూవీతో వెయ్యి కోట్లు, జవాన్ మూవీతో మరో వెయ్యి కోట్ల వసూళ్ళు రాబట్టాడు.
కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఆట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ విడుదలైన రోజు నుంచే సంచలనాలను సృష్టించింది. మంచి టాక్ ని సొంతం చేసుకోవడమే కాకుండా భారీగా కలెక్షన్లను నమోదు చేసుకుంది. ఓన్లీ హిందీలోనే 430 కోట్ల నెట్ వసూళ్ళను రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా 11 రోజులకు 850 కోట్ల గ్రాస్ వసూలు చేసి రెండురోజుల్లో 900 మార్క్ ను టచ్ చేయనుంది.
మరోవైపు అత్యంత వేగంగా 800 కోట్లు రాబట్టిన బాలీవుడ్ మూవీగా జవాన్ రికార్డ్ సాధించింది. మూడో వారంలోపు ఈ సినిమా కచ్చితంగా వెయ్యి కోట్లు రాబడుతుందని సినీ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దీంతో ఒకే ఏడాదిలో రెండు వెయ్యి కోట్లు సినిమాలు ఇచ్చిన హీరోగా షారూఖ్ హిస్టరీ క్రియేట్ చేయనున్నారు. ఇక ఇదే ఇయర్ లో షారూఖ్ నటించిన డంకీ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కూడా ఇంతే సక్సెస్ సాధిస్తుందని అంటున్నారు.