Green Coffee Benefits: కాఫీ అంటే అందరికి గుర్తుకు వచ్చేది గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ.. ఇప్పుడు గ్రీన్ కాఫీ ఒకటి ట్రెండింగ్ అవుతుంది. ఇది చాలా రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మనకి గ్రీన్ టీ తెలుసు. గ్రీన్ కాఫీ గురించి ఎక్కువగా ఎవ్వరికి తెలియదు. గ్రీన్ కాఫీ అనేది ఆరోగ్యపరంగా ఎంతో అద్భుతమైంది. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే కాఫీలో ఉండే కెఫిన్ ఆరోగ్యానికి చేడు చేస్తుందని అంటారు. అయితే.. గ్రీన్ కాఫీలో కెఫిన్ ఉండదని మీకు తెలుసా..? ఇది ఆరోగ్యానికి హాని కలిగించదు. ఈ గ్రీన్ కాఫీ వలన కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.
గ్రీన్ కాఫీ తాగటం వలన కలిగే ప్రయోజనాలు
బ్రోకలీ పౌడర్ సహాయంతోనే గ్రీన్ కాఫీ తయారవుతుంది. దీనిని గ్రీన్ కాఫీని బ్రోకలీ కాఫీ అని కూడా పిలుస్తారు. దీనికి కాల్చిన ముడి కాఫీ గింజల నుంచి తయారు చేస్తారు. ఈ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఈ కాఫీ తాగటం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
రక్తపోటు: అధిక రక్తపోటు ఉంటే ఈ గ్రీన్ కాఫీ బాగా పని చేస్తుంది. దీనిని రోజూ తాగితే రక్తపోటును అదుపు చేసి గుండెపోటు సమస్యలు కూడా తగ్గుతాయి.
శక్తి అధికం: గ్రీన్ కాఫీ గింజల్లో క్రోనాలాజిక్ యాసిడ్ జీర్ణశక్తిని పెంచుతుంది. దీంతో శక్తిని శరీరం అంతటా పంపిణీ అవుతుంది.
మధుమేహం: గ్రీన్ కాఫీ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీన్ని రోజూ తాగితే టైప్-2 డయాబెటిస్ రాదు.
యాంటీఆక్సిడెంట్: గ్రీన్ కాఫీ గింజలలో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని అనేక వ్యాధులతోపాటు వృద్ధాప్య, జుట్టు సమస్యలను తగ్గిస్తుంది.
చర్మానికి ప్రయోజనకరం: గ్రీన్ కాఫీలో కొవ్వు ఆమ్లాలు, లినోలెయిక్, రైజిక్, ఒలేయిక్ ఆమ్లాలున్నాయి. ఇవి మీ చర్మాన్ని హైడ్రేట్ చేసేందుకు బాగా ఉపయోగపడుతుంది.
ఊబకాయం: ప్రతీ రోజూ ఉదయాన్నే టీ,కాఫీ బదులు ఈ గ్రీన్ కాఫీ తాగితే బరువు తగ్గుతారు. గ్రీన్ కాఫీ తాగడం వల్ల పొట్టు చుట్టూ ఉండే కొవ్వు వేగంగా కరిగి బరువు తగ్గుతారని అధ్యయంలో తెలింది.
Also Read: ఈ పనులు చేయడం వల్ల ఎంతో యవ్వనంగా కనిపిస్తారు
Green Coffee
Health tips : రోజూ గ్రీన్ కాఫీ తాగుతే…డయాబెటిస్ నుంచి కొలెస్ట్రాల్ వరకు ఈ 5 వ్యాధులకు చెక్…!!
కాఫీ లేదా టీ తోనే చాలా మంది రోజు ప్రారంభం అవుతుంది. అయినప్పటికీ చాలా మంది ప్రజలు తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల టీలు తాగుతారు. వీటిలో గ్రీన్ టీని చాలా మంది ఇష్టపడతారు. గ్రీన్ టీ చాలా ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. దాని వినియోగం (Green coffee benefits) అనేక తీవ్రమైన వ్యాధులను దూరంగా ఉంచుతుంది. అయితే గ్రీన్ కాఫీ గురించి మీకు తెలుసా? ఈ కాఫీ అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని రుజువు చేసింది. ఈ ప్రత్యేక కాఫీలో యాంటీఆక్సిడెంట్ల పరిమాణం ఎక్కువగా ఉందని (Green coffee) కెఫీన్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఇది షుగర్ లెవల్స్ ను నార్మల్ గా ఉంచుతుంది. అంతేకాదు అనేక ఇతర వ్యాధులు దూరంగా ఉంటాయి. గ్రీన్ కాఫీ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
యాంటీ ఆక్సిడెంట్లకు మూలం:
గ్రీన్ కాఫీ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరాన్ని హానికరమైన ప్రభావాల నుండి కాపాడుతుంది. ఇందులో తక్కువ పొటాషియం సోడియం కూడా ఉండటంతో…ఇవి అధిక BP రోగులకు చాలా ప్రభావవంతంగా పరిగణించబడతాయి.
డయాబెటిక్ రోగులకు మేలు చేస్తుంది:
గ్రీన్ కాఫీ డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వస్తాయి. ఇది శరీరంలో వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే, మీరు సులభంగా గ్రీన్ కాఫీని మీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు.
శరీరం శక్తిని పొందుతుంది:
గ్రీన్ కాఫీని ఎనర్జీ బూస్టర్ అని పిలుస్తారు. మీరు తరచుగా అలసిపోతే గ్రీన్ కాఫీ తాగవచ్చు. దీన్ని తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందడంతో పాటు నీరసం తొలగిపోతుంది.
చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది:
కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారికి, గ్రీన్ కాఫీ గింజలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాదు గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. గ్రీన్ కాఫీని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ సమస్యను నివారించవచ్చు.
ఇది చర్మానికి మేలు చేస్తుంది:
గ్రీన్ కాఫీలో ఫ్యాటీ యాసిడ్, రోడియిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, ఒలియిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి అవసరం.