Grand Mother Becomes @34 Years Old : కొన్ని కొన్ని సంఘటనలు విన్నప్పుడు సంతోషించాలో.. విచారం వ్యక్తం చేయాలో కూడా అర్థం కానీ పరిస్థితులు వస్తుంటాయి. సాధారణంగా స్త్రీలు(Women’s) అమ్మ కానీ, నాన్నమ్మ(Grand Mother) కానీ, అమ్మమ్మ కానీ అయితే అది ఎంతో సంతోషించాల్సిన విషయం. సింగపూర్(Singapore) లో కూడా ఓ మహిళ తాను నానమ్మను కాబోతున్నానని ప్రపంచానికి తెలియజేసి మురిసిపోయింది.
సాధారణంగా ఎవరైనా నానమ్మ అవుతారు…ఇందులో విశేషం ఏముంది అని అనుకుంటున్నారా..నానమ్మగా ప్రమోషన్ పొందిన ఆ మహిళ వయసు 34 సంవత్సరాలు. సింగపూర్ లో ఫెర్లీ అనే మహిళ తాను నానమ్మ అయింది. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్(Social Media Influencer) ఆమె 34 ఏళ్ల వయసులో నానమ్మ అయిన వార్తను పంచుకోవడంతో, ప్రజలు కొంచెం గందరగోళానికి గురయ్యారు. ఇందుకు ఆ మహిళను అభినందించాలా లేక ఓదార్చాలా అని వారికి అర్థం కాలేదు. నిజానికి ఆ మహిళ కుమారుడికి ఇంకా 17 ఏళ్లు మాత్రమే.
View this post on Instagram
షెర్లీ సోషల్ మీడియాలో తన 17 ఏళ్ల కొడుకు తండ్రి అయ్యాడు.నేను నానమ్మ అయినందున చాలా సంతోషంగా ఉంది. ఇటీవలె తమ కుటుంబం వేడుక చేసుకున్నట్లు తను తెలిపింది. సింగపూర్ లో షెర్లీ ఒక రెస్టారెంట్‌ను నడుపుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 17 వేలకు పైగా ఫాలోవర్లను ఉన్నారు. ప్రస్తుతం ఆమె కొడుకు చదువుకుంటున్నాడు. తన కొడుకు చేసిన పనికి తనను తిట్టడానికి బదులు సలహాలు ఇస్తున్నట్లు చెప్పింది.
వాస్తవానికి షెర్లీ మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ఆమె 17 సంవత్సరాల వయస్సులో తన కొడుకుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె 5 మంది పిల్లలకు తల్లి. తన పిల్లలు ఇంత చిన్న వయస్సులో కుటుంబాన్ని ప్రారంభించాలని ఆమె కోరుకోలేదు, కానీ తన కొడుకుతో ఈ తప్పు జరిగిన తరువాత, ఆమె ఈ చర్య తీసుకోవలసి వచ్చింది. ఆమె పోస్ట్‌పై వ్యాఖ్యానిస్తూ, ప్రజలు ఆమె విఫలమైన తల్లి అని, తన బిడ్డకు చిన్న వయస్సులోనే కుటుంబాన్ని ప్రారంభించమని సలహా ఇస్తున్నారని అన్నారు. అయితే, కొంతమంది ఆమె పట్ల సానుభూతి చూపారు. మరికొందరు ఆమె తన కుమారుడికి సరైన మార్గదర్శకత్వం వహిస్తోందని తెలిపారు.