కులగణన…దేశంలో ఇదో పెద్ద టాపిక్. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇది ఇప్పుడు ప్రధాన ప్రచార అస్త్రం అయ్యింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కులగణనే ప్రధాన ఆయుధంగా ప్రజల్లోకి వెళుతున్నారు. తాము అధికారంలోకి వస్తే వెంటనే దాన్ని చేపడతామని చెబుతున్నారు. ఇప్పటికే బీహార్ ప్రభుత్వం కులాల ఆధారంగా డేటాను సేకరించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పంజాబ్, ఒడిశా ప్రభుత్వాలు కూడా కుల గణనపై సమాచారాన్ని సేకరించేందుకు సర్వేలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా కుల గణనపై ముందడుగు వేసింది.
ఆంధ్రప్రదేశ్ లో 92ఏళ్ళ కిందట సమగ్ర కులగణన జరిగింది. ఇప్పుడు మళ్ళీ జరుగుతోంది. స్వాతంత్ర్యం రాక ముందు ప్రతీ 10ఏళ్ళకొకసారి జరిగే కులగణన తర్వాత తగ్గుతూ వచ్చింది. 1911, 21, 31 లలో జరిగింది. ఆ తర్వాత ఆగిపోయింది. దీని ప్రకారం 1931లో జరిగిన కులగణనే చివరిది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరెంతమంది ఉన్నారు అనేది అంచనాలను బట్టి చెప్పడమే కానీ కరెక్ట్ లెక్కలు లేవు. దేశంలో అన్ని రాష్ట్రాలదఈ ఇదే పరిస్థితి. ప్రస్తుతం కులగణన చేపట్టడం ద్వారా ఆంధ్ర ప్రజలను అట్రాక్ట్ చేయవచ్చని అనుకుంటోంది వైసీపీ గవ్నమెంట్. లెక్కల బట్టీ సంక్షేమ పథకాలను అభివృద్ధి చేస్తామని…అన్ని వర్గాల వారినీ ఆర్ధికంగా పైకి తీసుకువస్తామని చెబుతోంది. దీనికి కోసంచాలా కసరత్తులు కూడా చేసింది.
Also Read:దాడులు మొదలెట్టిన హిజ్బుల్లా గ్రూప్..7గురు ఇజ్రాయెల్ సైనికులకు గాయాలు
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ప్రణాళిక, సచివాలయాల శాఖలకు సంబంధించి ఆరుగురు అధికారులతో ఓ కమిటీని వేసింది వైసీపీ గవర్నమెంట్. వీరు దేశంలో ఇప్పటికే కులగణన చేపట్టిన రాష్ట్రాల్లో పర్యటించారు. అక్కడ కులగణనలో ఏర్పడ్డ సమస్యల గురించి తెలుసుకుని ప్రబుతవానికి అధికారులు నివేదికను ఇచ్చారు. దీని ప్రకారం రాష్ట్రంలో ఉన్న సుమారు కోటీ 60 లక్షల కుటుంబాలను ఇప్పుడే సర్వే చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రశ్నావళితో యాప్ సిద్ధం చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఈ కుల గణన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సచివాలయ ఉద్యోగులు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి, సమాచారాన్ని సేకరిస్తారు. వీరు సేకరించిన సమాచారంపై మళ్ళీ స్పెషల్ గా నియమించిన అధికారులు రీవెరిఫికేషన్ కూడా నిర్వహిస్తారు. దీని కోసం ప్రాంతీయ స్థాయిలోనే సన్నాహక సమావేశాలను నిర్వహించబోతున్నారు. బీసీ సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ఈ గణన జరగనుంది. జిల్లా స్థాయిలో 15, 16 తేదీల్లోనూ ప్రాంతీయ స్థాయిలో 17 నుంచి 24 వరకు రాజమహేంద్రవరం, కర్నూలు, విశాఖ, విజయవాడ, తిరుపతిలో సదస్సులు నిర్వహించనుంది. 6 నెలల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కులగణన కోసం తయారు చేసిన యాప్ను ప్రతీ ఇంటికి తీసుకుని వెళ్ళి సమాచారం అక్కడే అప్పుడే డిజిటల్ గా అప్ లోడ్ చేయనున్నారు. ఇందులో సచివాలయ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ఒకే విడతలో కులగణన పూర్తి చేయడమే కాక నవంబర్ 27లోపు సర్వే పూర్తవ్వాలని వైసీపీ ప్రభుత్వం ఆదేశించింది. ఇంటింటికి వెళ్ళినప్పుడు ఎలాంటి సర్టిఫికేట్లు అడగకూడదు. ఇంట్లో ఉన్న వ్యక్తఉల పేర్లు, వయసు, జెండర్, భూమి(వ్యవసాయ-వ్యవసాయేతర), ఇంట్లోని పశువులు, వృత్తి, అన్నిరకాలుగా వచ్చే ఆదాయం, కులం, ఉపకులం, మతం, విద్యార్హత, నివాసం ఉండే ఇల్లు, మంచినీటి సదుపాయం, టాయిలెట్లు, గ్యాస్ ఉందా లేదా అనే వివరాలు సేకరిస్తారు.