Death threat to Actress Gautami: గౌతమి….ఈమె తెలియని ఎవరూ ఉండరు. ఒకప్పుడు హాట్ హీరోయిన్ గా వెలుగొందిన ఈమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. తాజాగా ఆమె గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి.. తనకు చెందిన విలువైన భూమిని కబ్జాకు గురైనట్లుగా ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఈ పని చేసిన తమిళనాడు ల్యాండ్ మాఫియా గౌతమిని, ఆమె కూతురిని కూడా చంపుతామని చెదిరిస్తున్నారు.
గౌతమికి చెందిన రూ.25 కోట్లు విలువైన భూమి కబ్జాకు గురైంది. శ్రీ పెరంబదూర్ తో పాటూ తమిళనాడులో పలు ప్రాంతాల్లో ఆమెకు స్థలాలు ఉన్నాయి. గౌతమి క్యాన్సర్ బారిన పడినప్పుడు వాటిని అమ్మాలనుకున్నారు. దానికోసం రియల్ ఎస్టేట్ వ్యాపారి అళగప్పన్ ను సంప్రదించారు. అప్పుడు జరిగిన లావాదేవీల్లో గౌతమి స్థలాల దస్తావేజుల మీద అళగప్పన్ ఫోర్జరీ సంతకాలు చేసి తన పేరుతో పకిలీ డాక్యుమెంట్లను సష్టించుకున్నాడు. దీని గురించి తెలిసిన గౌతమి అతనిని నిలదీయగా చంపేస్తామంటూ బెదిరిస్తున్నాడు. తన వెనుక బోలెడంత రాజకీయ బలముందని, ఆ భూములను తకే వదిలేయాలని అళగప్పన్ బెదిరిస్తున్నారు.
దీంతో గౌతమి చెన్నై పోలీసులను ఆశ్రయించారు. సదరు వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. నటి గౌతమి ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
తెలుగు అమ్మాయి అయిన గౌతమి తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. మొదటి భర్త సందీప్ భాటియాతో విడిపోయిన తర్వాత కమల్ హసన్ తో కొంత కాలం ఉండి తర్వాత అతనితో కూడా విడిపోయింది.
Also Read: ఈ హీరోయిన్ ఇక టాలీవుడ్‌కు దూరం.. కొత్త ఆఫర్లను తిరస్కరిస్తోన్న లేడీ సూపర్‌స్టార్!