KTR Reacts to Anand Mahindra Tweet: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో గూగుల్ భారీ క్యాంపస్ (Google Campus) ఏర్పాటును పొగుడుతూ ఆనంద్ మహీంద్రా రీసెంట్ గా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కాగా దీనికి తాజాగా రిప్లై ఇచ్చిన కేటీఆర్.. హైదరాబాద్ గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోనని అన్నారు.
Also Read: వైద్య రంగంలో అద్భుతం.. ఏకంగా ఓ వ్యక్తి కన్నునే మార్చేసి వేరే కన్ను పెట్టారు.
ఈ మేరకు హైదరాబాద్ (Hyderabad) లో గూగుల్ క్యాంపస్ నిర్మాణపనులు జరగుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ‘ఇది ఓ బిల్డింగ్‌కు సంబంధించిన వార్త కాదు. దీని ప్రాముఖ్యత మొత్తం అర్థమయ్యేలా నేను వార్తను వీలైనంత సావకాశంగా చదివా. గూగుల్ లాంటి అంతర్జాతీయ దిగ్గజం అమెరికా ఆవల అతిపెద్ద క్యాంపస్ నిర్మించేందుకు ఓ దేశాన్ని ఎంపిక చేసిందంటే ఇదే కేవలం కమర్షియల్ న్యూస్ కాదు. భౌగోళిక రాజకీయ ప్రాధాన్యమున్న వార్త’ అంటూ తనదైన స్టైల్ లో హైదరాబాద్ గొప్పదనాన్ని పొగిడేశారు.
Dear Anand Ji,
Did you know that the World’s Largest campus of Amazon is located in Hyderabad?
Also the second largest campuses of Apple, Meta, Qualcomm, Micron, Novartis, Medtronic, Uber, Salesforce and many more have also been setup in Hyderabad in the last 9 years
That’s… https://t.co/nPXJtCX24S pic.twitter.com/bozaJYSrrx
— KTR (@KTRBRS) November 10, 2023
ఇక దీనిపై తాజాగా స్పందించిన ఐటీ మంత్రి కేటీఆర్ (KTR).. హైదరాబాద్ గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోను అంటూ మహీంద్రాకు రిప్లై ఇచ్చారు. ‘ఆనంద్ జీ.. మీకు ఈ విషయం తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్(Amazon Campus) కూడా హైదరాబాద్‌లోనే ఉంది. అంతేకాదు యాపిల్, మెటా, క్వాల్కామ్, మైక్రాన్, నోవార్టిస్, మెడ్‌ట్రానిక్, ఊబెర్, సేల్స్‌ఫోర్స్ వంటి ఎన్నో సంస్థలు గత తొమ్మిదేళ్లల్లో తమ భారీ క్యాంపస్‌లు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయి. అందుకే..#HappeningHyderabadఅని మేము చెప్పేది. అమెజాన్ క్యాంపస్‌ను ఫొటోను కూడా అటాచ్ చేశాను చూడండి’ అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read: ఖతార్ లో నేవీ అధికారులకు మరణశిక్ష.. అప్పీల్ చేసిన భారత్!