IIFL ఫైనాన్స్ గోల్డ్ లోన్ వ్యాపారంలో కొనసాగుతున్న ఆడిట్ మధ్య RBI గోల్డ్ లోన్స్ నిబంధనలను సమీక్షిస్తోంది. ఈ సమీక్ష విలువకు రుణం, నగదు పంపిణీపై పరిమితి, గోల్డ్ రీసెర్చ్, గోల్డ్ ఆక్షన్ కి సంబంధించిన అంశాలపై జరుగుతోంది. త్వరలోనే ఆర్బీఐ ఈ అంశాలన్నింటిపై వివరంగా సర్క్యులర్ జారీ చేయవచ్చు.
గోల్డ్ లోన్స్ విషయంలో అన్ రిటెన్ రూల్స్..
Gold Loan Rules: ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ వ్యాపారంపై నిషేధం వల్ల గోల్డ్ లోన్ వ్యాపారంలో అనేక పద్ధతులు ఉన్నాయని, వీటిని రాతపూర్వకంగా ఎక్కడా ప్రస్తావించలేదని గోల్డ్ లోన్ ఫైనాన్స్ కంపెనీ సీఈవోను ఉటంకిస్తూ హిందూ బిజినెస్ లైన్ పేర్కొంది. ఇలాంటి విధానాలను అరికట్టేందుకు పరిశ్రమల స్థాయిలో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన చెబుతున్నారు.
మార్గదర్శకాల అవసరం
Gold Loan Rules: దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి రెగ్యులేటర్ చాలా గోల్డ్ లోన్ కంపెనీలను సంప్రదించింది. అయితే, పరిశ్రమ స్థాయిలో సంస్కరణలు తీసుకురావాలంటే స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ గుర్తించింది. మరో ఎన్బిఎఫ్సి సీఈవోను ఉటంకిస్తూ, ఆర్బీఐ తెచ్చే సర్క్యులర్ ఇప్పటి వరకు అనుసరించిన పద్ధతుల్లోని ఆందోళనలు లేదా లోపాలను పరిష్కరిస్తుందని చెప్పినట్టు హిందూ బిజినెస్ లైన్ పేర్కొంది. అయితే ఈ విషయంపై ఆర్బీఐ ఇంకా స్పందించలేదు.
Also Read: జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్ భార్య అనితా గోయల్ మరణం
నగదు ఇవ్వకూడదు..
Gold Loan Rules: గోల్డ్ లోన్ కోసం లోన్స్ ఇచ్చే సంస్థ (బ్యాంక్ లేదా నాన్-బ్యాంకు) నగదు రూపంలో చెల్లించకూడదని RBI అంచనా వేస్తోంది. దీంతో, బ్యాంకు ఎకౌంట్స్ ద్వారా లోన్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేలా ఎన్బీఎఫ్సీలు బ్యాంకులతో టైఅప్ అవుతాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, బ్యాంకులు నగదు రూపంలో 20 వేల రూపాయల వరకు మాత్రమే లోన్ ఇవ్వగలవు. అయితే, బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం అలాంటి నియమం లేదు. అత్యవసర సమయాల్లో గోల్డ్ లోన్ తీసుకుంటారు కాబట్టి, నగదు రూపంలో లోన్ ఇచ్చే విధానం పరిశ్రమలో చాలా కాలంగా కొనసాగుతోంది.
గోల్డ్ వాల్యుయేషన్ పద్ధతుల్లో తేడా
Gold Loan Rules: రెండవది, బంగారం విలువ చేసే విధానంలో తేడా ఉంటుంది. దీని కారణంగా, విలువకు రుణం అంటే ఎన్ని గ్రాముల బంగారంపై ఎంత రుణం ఇవ్వబడుతుంది అనేది కూడా ప్రభావితం కావచ్చు. ఉదాహరణకు, ఉత్తర మరియు దక్షిణ భారతదేశాల మధ్య బంగారం ధరలో భారీ వ్యత్యాసం ఉంది. బాంబే బులియన్ రేట్ల (BBR) నెలవారీ సగటు ఆధారంగా బంగారం స్టాక్‌కు విలువ ఇవ్వాలని RBI కోరుతోంది.
గోల్డ్ వాల్యుయేషన్ అనేది పెద్ద సమస్య
Gold Loan Rules: అయితే, రాష్ట్రాల్లోని స్థానిక ధరలకు చాలా తేడా ఉందని ఒక రిపోర్ట్ పేర్కొంది. “రేట్లను ఏకరీతిగా చేసే ప్రయత్నం రుణం తప్పు వాల్యుయేషన్ కు దారితీయవచ్చు.” అని రిపోర్ట్ చెబుతోంది. దక్షిణాదికి చెందిన అనేక NBFCలు ఈ విషయాన్ని రెగ్యులేటర్‌తో లేవనెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ వాల్యుయేషన్ అనేది పెద్ద సమస్యగా మిగిలిపోయింది.