Actress Nayanthara: సౌత్ సినిమా ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో అగ్ర హీరోలందరి సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నప్పటికీ ఆమె దర్శకుడు విఘ్నేశ్ శివన్ ని వివాహం చేసుకుని ఇద్దరు మగబిడ్డలకు తల్లి అయ్యింది.
గత ఏడాది షారుఖ్ ఖాన్ సరసన జవాన్ మూవీతో (Jawan Movie) బాలీవుడ్ లోకి అడుగుపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. తమిళ్ తో పాటూ కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తోన్న ఈ హీరోయిన్ సూర్య – మురుగదాస్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘గజిని’ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
Also Read : ‘Thalapathy 69’ కోసం విజయ్ షాకింగ్ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లో తెలుసా?
వరస్ట్ సెలక్షన్..
2005లో వచ్చిన ‘గజిని’ మూవీ (Ghajini Movie) సూర్య కెరీర్లోనే బిగెస్ట్ హిట్ అందుకుంది. ఇందులో అసిన్ తో పాటూ నయనతార మరో హీరోయిన్ గా నటించింది ఇందులో చిత్ర అనే డాక్టర్ పాత్రలో నయన్ కనిపించింది. అయితే ఈ పాత్ర తన మూవీ కెరీర్లోనే అత్యంత చెత్త ఎంపిక అంటూ వ్యాఖ్యానించింది.
తాను ఇప్పటివరకు చేసిన సినిమాలలో గజిని సినిమానే తన వరస్ట్ సెలెక్షన్ అని చెప్పింది. అంతేకాకుండా ఈ సినిమాలో నటించినందుకు ఇప్పటికి కూడా చింతిస్తుంటానని.. ఈ మూవీలో తన పాత్రను మేకర్స్ చెప్పినట్లుగా చిత్రీకరించలేదని, తనను చెత్తగా ఫోటోలు తీశారంటూ తెలిపింది. దీంతో నయన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి.