Actress Genelia Ready For Tollywood Re Entry : టాలీవుడ్ (Tollywood) లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జెనిలీయా (Genelia) త్వరలోనే తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 2012 లో బాలీవుడ్ హీరో రితేష్ దేశముఖ్ (Riteish Deshmukh) ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైన ఈ హీరోయిన్ ఈ మధ్య బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్గా భర్త రితేష్‌తో కలిసి మరాఠీలో ‘వేద్’ అనే సినిమాలో నటించింది.
తెలుగులో వచ్చిన ‘మజిలీ’ మూవీకి రీమేక్ గా వచ్చిన ‘వేద్’ సినిమాలో జెనీలియా తన యాక్టింగ్ తో ప్రశంసలు అందుకుంది. ఇటీవలే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ చేసింది. ప్రెజెంట్ హిందీలో పలు ఆఫర్స్ అందుకుంటున్న జెనీలియా.. ఇప్పుడు తెలుగు సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్వయంగా వెల్లడించింది.
Also Read : అఘోర పాత్రలో దగ్గుబాటి రానా.. షాకింగ్ విషయం బయటపెట్టిన టాలీవుడ్ హీరో!
తెలుగులో నటించేందుకు రెడీ..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జెనీలియా.. మంచి పాత్ర దొరికితే తెలుగులోనూ నటించడానికి రెడీ అని స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే.. తను తెలుగులో హీరోయిన్గా చేస్తుందా? లేక ప్రత్యేక పాత్రలు చేస్తుందా? అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు కానీ.. కచ్చితంగా తనకు తెలుగులో ఆఫర్స్ వస్తే చేస్తానని స్పష్టం చేసింది. నిజానికి జెనీలియా కంటే సీనియర్స్ త్రిష, నయనతార నేటికీ హీరోయిన్లుగా దూసుకుపోతున్నారు. ఇలాంటి తరుణంలో జెనీలియా కూడా తెలుగు సినిమాల్లో నటిస్తే బాగుంటుందని ఆమె ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.