HBD Genelia D’Souza: తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ అప్పట్లో సౌత్ ఇండియన్ లీడింగ్ యాక్ట్రెస్ గా వెలుగొందింది. తన నటన, అభినయంతో రెండు నంది అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సహా అనేక ప్రశంసలు అందుకుంది.
జెనీలియా 2003 లో ‘తుజే మేరీ కసమ్’ అనే హిందీ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇందులో జెనిలీయ తన భర్త రితేష్ దేశ్ ముఖ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అదే సంవత్సరంలో బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అప్పట్లో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం జెనీలియాకు యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత 2006లో బొమ్మరిల్లు సినిమాలో ”హ.. హా హాసిని.. కుదిరితే కప్పు కాఫీ, వీలైతే నాలుగు మాటలు” అంటూ కుర్రకారు హృదయాలను దోచేసింది ఈ ముద్దుగుమ్మ. అలా తెలుగులో వరుస సినిమాలు చేస్తూ తనదైన ముద్ర వేసింది. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. రెడీ, డీ, హ్యాపీ, మిస్టర్ మేధావి వంటి కమర్షియల్ హిట్స్ లో నటించింది.
తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ సత్తా చాటింది ఈ సొట్ట బుగ్గల సుందరి. హిందీలో కల్ట్ క్లాసిక్ ‘జానే తు…యా జానే నా’ లో అదితి పాత్రలో మెప్పించిన జెనీలియా నేషనల్ క్రష్ గా మారిపోయింది. హిందీలోనూ వరుస ఆఫర్లతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదిగింది.
కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సమయంలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. 2012 లో నటుడు రితేష్ దేశముఖ్ ను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత కుటుంబం పై దృష్టి పెట్టేందుకు ఇండస్ట్రీకి వీడ్కోలు పలికింది ఈ అందాల భామ. చాలా కాలం గ్యాప్ తర్వాత 2022లో తన భర్త రితేష్ దేశముఖ్ తో కలిసి ‘వేద్’ సినిమాతో మళ్ళీ తెర పై మెరిసింది.
జెనీలియా, ఆమె భర్త రితీష్ బి-టౌన్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా పేరు పొందారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించే ఈ జంట తమ సంతోషకరమైన క్షణాలు, ఫన్నీ రీల్స్ ను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంటారు.
Also Read: Bigg Boss Telugu 8: బిగ్బాస్ 8లో శివాజీ ఎంట్రీ ! కానీ కంటెస్టెంట్ కాదు.. ? – Rtvlive.com