Vijay Devarakonda New Movie : రౌడీ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా ‘ఫ్యామిలీ స్టార్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ‘గీత గోవిందం’ మూవీ ఫేమ్ పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలను కొంతవరకు ఆకట్టుకునేలా చూపించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది తప్పితే విజయ్ దేవరకొండ రేంజ్ హిట్ అవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ తదుపరి ప్రాజెక్ట్ పై ఆశలు పెట్టుకున్నారు. విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీని ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చేయబోతున్న విషయం తెలిసిందే.
‘VD12’ అనే వర్కింగ్ టైటిల్ తో ఎప్పుడో అనౌన్స్ మెంట్ చేసిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని రీసెంట్ గానే స్టార్ట్ చేసారు. ఈ మధ్య ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ని వచ్చే నెల నుంచి వైజాగ్ లో చిత్రీకరించబోతున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో పాటలు ఉండవట. కాకపోతే థీమ్ మ్యూజిక్ కి ఇంపార్టెన్స్ ఉంటుందట. అంటే లోకేష్ కనగరాజ్ ‘ఖైదీ’ సినిమాలా అన్నమాట. ‘ఖైదీ’ సినిమాలో అసలు పాటలే ఇండవు. కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుంది.
ఇప్పుడు విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్జ్ట్ కూడా ఇదే తరహాలో ఉంటుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. సినిమాలో విజయ్ దేవరకొండ పోషిస్తున్న పాత్ర, సినిమా కథనం ఎంతో ప్రత్యేకంగా ఉంటాయని అంటున్నారు. ఈ రెండింటి మీదే సినిమా అంతా సాగనుండటంతో ఇందులో పాటలకి చోటు లేదని తెలుస్తోంది. కాకపోతే థీమ్ మ్యూజిక్ మాత్రం సినిమా సోల్ కి తగ్గట్లుగా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ థీమ్ మ్యూజిక్ ని అనిరుద్ రవిచంద్రన్ కంపోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘జెర్సీ’ మూవీకి అనిరుద్ ఇచ్చిన అల్బమ్, బీజీఎమ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు దానికి మించి ‘VD12’ ప్రాజెక్ట్ థీమ్ మ్యూజిక్ ఉనుండనున్నట్లు సమాచారం.
Also Read : సూర్య సినిమాని పక్కన పెట్టి.. ఆ స్టార్ హీరో కొడుతో సుధా కొంగర న్యూ ప్రాజెక్ట్?