Gangs Of Godavari 2 Days Collections : టాలీవుడ్ (Tollywood) హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) నడిచిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తుంది. గత కొన్ని రోజులుగా థియేటర్స్ లో సరైన సినిమాలు లేక నిరాశలో ఉన్న ఆడియన్స్ కి ఈ మూవీ సరికొత్త మాస్ వినోదాన్ని పంచింది. మే 31 న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.
ఈ సినిమాతో పాటూ ‘భజే వాయు వేగం’, ‘గం. గం.. గణేశా’ వంటి సినిమాలు రిలీజ్ అయినా.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రూ. 5.2 కోట్ల నెట్, రూ.8. 2కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ తో టాప్ లో నిలిచింది. ఇక రెండో రోజు కూడా ఈ సినిమా అదే జోరును కొనసాగించింది.
Also Read : బన్నీ ఫ్యాన్స్ కి షాక్.. ‘పుష్ప 2’ క్లైమాక్స్ చేంజ్, సుకుమార్ సడెన్ ట్విస్ట్!
రెండో రోజు అదే జోరు..
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) రెండో రోజు రూ.3 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. దీంతో రెండు రోజుల్లో ఈ సినిమా రూ.8.2 కోట్ల నెట్, రూ.12.01 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. శనివారం రోజు కేవలం 25 శాతం ఆక్యుపెన్సీతో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే మాములు విషయం కాదు. ఇదే జోరు కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
కాగా కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) అంజలి (Anjali) ఫిమేల్ లీడ్స్ గా నటించారు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
𝐌𝐀𝐒𝐒 𝐊𝐀 𝐃𝐀𝐒 𝐑𝐀𝐌𝐏𝐀𝐆𝐄 continues on big screens 🔥#GangsOfGodavari grossed over 𝟏𝟐.𝟏 𝐂𝐑 in 2 days at the WW Box-Office! 💥
Watch #GOG at theatres near you! 🤩
Book your tickets now 🎟️ – https://t.co/XSMEvomVKG pic.twitter.com/O7pQeI41AJ
— Sithara Entertainments (@SitharaEnts) June 2, 2024