America : సంగీత రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డు(Grammy Awards) ల ప్రధానోత్సవం అమెరికా(America) లోని లాస్ ఏంజిల్స్(Los Angeles) లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాలకు చెందిన వివిధ సినీ ప్రముఖులు పాల్గొని తమ పాటలతో అలరించారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారత్‌కు చెందిన సంగీత కళాకారులు శంకర్ మహదేవన్, జాకిర్ హుస్సెన్‌లు కూడా విజయకేతనం ఎగరవేశారు. వీళ్లు కంపోజ్ చేసిన ‘దిస్ మూమెంట్’ ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డును దక్కించుకుంది.
Also Read : శ్రీదేవి డెత్‌పై ఫేక్ పత్రాలు చూపించారు: సీబీఐ
ఈ పాటను శంకర్ మహదేవన్(Shankar Mahadevan) (సింగర్), జాకిర్ హుస్సేన్(Zakir Hussain) (తబలా), గణేశ్ రాజగోపాలన్(Ganesh Rajagopalan) (వయోలిన్), జాన్ మెక్లాఫ్లిన్ (గిటార్) వంటి ప్రతిభావంచులైన ఎనిమదిమంది ‘శక్తి’ బ్యాండ్ పేరిట కంపోజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈ పోటీని ఎదుర్కొని ‘శక్తి’ గెలవడంతో.. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
గ్రామీ అవార్టు వచ్చిన సందర్భంగా శంకర్ మహదేవన్ మాట్లాడారు. ప్రతి విషయంలో నాకు ఎంతో ప్రోత్సాహం అందించిన నా భార్యకు ఈ అవార్డును అంకితం చేస్తున్నానని చెప్పారు. అలాగే ఇందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నాననంటూ ఆనందం వ్యక్తం చేశారు.
Also Read : పెళ్లిగురించి హింట్స్ ఇస్తున్న ప్రభాస్ హీరోయిన్…లేటెస్ట్ పోస్టులో అర్థం అదేనేమో?