మహిళలపై కొందరు మగపుటేనుగలు చేస్తున్న దారుణాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలలు అత్యాచారానికి గురవుతూనే ఉన్నారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి శిక్షిస్తున్నా కూడా ఇలాంటి ఆగాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది. ఓ గర్భిణి(34)పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. అంతేకాదు ఆ తర్వాత ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ దుర్ఘటన మధ్యప్రదేశ్లోని మొరానా జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది.
Also Read: ఆ రాష్ట్రంలో పీచు మిఠాయిపై నిషేధం.. ఎందుకంటే
ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతోంది. ఆమె శరీరం 80 శాతం గాయాలతో కాలిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి భర్త ఓ లైంగిక దాడి నేరంలో జైలుకెళ్లి ఇటీవలే బెయిల్పై బయటికి వచ్చాడు. అయితే తన భర్తపై లైంగిక దాడి పెట్టిన మహిళతో రాజీ చేయడానికి బాధితురాలు ప్రయత్నించింది. ఇందుకోసం తన భర్తపై కేసు పెట్టిన మహిళ గ్రామానికి వెళ్లింది. అక్కడ ఆమె ఇంట్లో ముగ్గురు వ్యక్తులు బాధితురాలిపై సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.