Japan : ఒక పిల్లి(Cat).. ఒక నగరాన్నే వణికిస్తోంది. తప్పిపోయిన ఆ పిల్లిని వెతికేందుకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ పిల్లి నగరంలో హై అలర్ట్(High Alert) కూడా విధించారు. జపాన్(Japan) లో జరుగుతున్న ఈ వింత ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. జపాన్లోని ఫుకియామా నగరంలో ఓ పిల్లి ప్రమాదకరమైన రసాయనాల ట్యాంకులో అనుకోకుండా పడిపోయింది. అయితే అందులో నుంచి అది సురక్షితంగా బయటకు వచ్చేసింది. అక్కడి నుంచి వెంటనే పారిపోయింది కూడా. ఇప్పుడు ఈ విషయమే ఫుకియామా(Fukuyama) ప్రజలను, అధికారులను తీవ్రంగా భయపెడుతోంది. ఎందుకంటే పిల్లి పడిన ట్యాంకులోని రసాయనాలు చాలా డేంజరస్ అంట. వీటిని ఒంటి నిండా అంటించుకున్న పిల్లి వల్ల ఆ రసాయనాలు నగరమంతా స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇవి ఎంత అపాయకరమంటే… వాటిని తాకితేనే చనిపోయే ప్రమాదం ఉంది. వీటి వల్ల క్యాన్సర్ కూడా వస్తుంది.
ముట్టుకుంటే అంతే సంగతులు..
ట్యాంకులో నుంచి వచ్చిన పిల్లి ఇంత డేంజరస్ రసాయనాలను వెంటేసుకుని తిరుగుతోంది. అది తెలియకుండా దాన్ని ఎవరైనా ముట్టుకున్నారో అంతే వారి సంగతి. అందుకే ఇక్కడి అధికారులు పిల్లిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఫుకియామాలో హైఅలర్ట్ ప్రకటించారు. అంతేకాదు పిల్లిని వెతికేందుకు పెట్రోలింగ్(Patrolling) ను కూడా పెంచారు. ఆ పిల్లి ఎక్కడ కనిపించినా అప్రమత్తంగా ఉండాలని అధికారులు.. ప్రజలకు సూచించారు. ఆ ఫ్యాక్టరీ నుంచి డేంజరెస్ కెమికల్ అంటుకున్న పిల్లి.. బయటికి వెళ్తున్న దృశ్యాలు.. అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరా(CCTV Camera) ల్లో రికార్డ్ అయ్యయి. దీంతో ఆ వీడియోలను వైరల్ చేసిన అధికారులు ఆ పిల్లి ఎక్కడ కనిపించినా సమాచారం అందించాలని ఫుకుయామా నగరవాసులకు సూచించారు. పిల్లిని ముట్టుకున్నా..లేదా దాని మీద నుంచి వచ్చే గాలిని పీల్చినా ఒంటి మీద ద్దుర్లు, వాపు వస్తాయని తెలిపారు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురవుతారని డాక్టర్లు హెచ్చరించారు.
చనిపోయినా పట్టుకోవాలి..
అయితే పిల్లి ఇప్పటివరకు అధికారులకు దొరకలేదు. అసలు అది బతికి ఉందో , చనిపోయిందో కూడా తెలియడం లేదు. సాధారణంగా అయితే పిల్లులు తమ శరీరాలను తామే నాకుతాయి. అలాంటి పక్షంలో ట్యాంకులో పడిపోయిన పిల్లి ఈపాటికే తన ఒంటి మీద ఉన్న రసాయనాలను నాకి ఉంటుందని.. చనిపోయి ఉంటుందని అదికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అది చనిపోయినా కూడా దాని బాడీ మీద ఉన్న రసాయనాలు డేంజరెస్సే కాబట్టి…చనిపోయిన పిల్లి అయినా దొరికే వరకు వెతుకుతామని చెబుతున్నారు.
Also Read : Telangana : తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా