Health Drinks: మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగించకండి అని చెబతోంది కేంద్రం. అవి హెల్త్ డ్రింక్స్ కాదని తెలిపింది. వాటిని ఫంక్షన్ న్యూట్రిషియన్ డ్రింక్స్‌గా మారుస్తున్నామని చెప్పింది. కొన్ని రోజుల క్రితమే బోర్నవీటాను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగిస్తున్నామని కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్‌లో హార్లిక్స్‌ను కూడా చేర్చింది. హిందూస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్ ప్రాడెక్ట్స్ అయిన హార్లిక్స్, బూస్ట్‌లను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తీసేసింది.
బూస్ట్, బోర్నవీటా, హార్లిక్స్…పిల్లలకు ఇషంగా తాగే చాక్లెట్ పానీయాలు. ఇవి తాగితే బోలెడంత శక్తి వస్తుంది అంటూ ప్రచారం చేస్తారు. పిల్లల్లో ఎదుగుదలకు బోర్నవీటా తోడ్పడుతుంది. దీనిలో రకరకాల విటమిన్లు ఉన్నాయని యాడ్స్‌లో చెబుతారు. దీన్ని నమ్మి చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు బోర్నీటాను అలవాటు కూడా చేశారు. అయితే ఇది శరీరానికి ఏమీ హానీ చేయకపోయినా…హెల్త్ డ్రింక్ మాత్రం కాదని అంటోంది కేంద్రం. బోర్నవీటాను హెల్త్ డ్రింక్ లిస్ట్‌లో నుంచి తీసేశాయలని వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.అన్ని ఈ-కామర్స్ సంస్థలకు తమ ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించాలని సూచించింది.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ యాక్ట్ ప్రకారం హెల్త్ డ్రింక్స్‌కు సరైన నిర్వచనం లేదు. అందుకే దీని కేటగిరీలో హార్లిక్స్ వంటి వాటిని చేర్చలేము. పైగా బోర్నవీటా, హార్లిక్స్ వటి వాటిలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు అస్సలు వాటిని హెల్త్ డ్రింక్స్‌గా పరిగణించలేము అని…అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలపింది కేంద్రం. ఫంక్షనల్ న్యూట్రీషియన్ డ్రింక్స్ కేటగిరి ప్రోటీన్స్, మైక్రో న్యూటిషీయంట్స్ అవసరాలను అందిస్తుంది. మొక్కలు, జంతువు, సముద్ర లేదా సూక్ష్మజీవుల మూలాల నుంచి ఏదైనా బయోయాక్టివ్ కాంపోనెంట్ని చేర్చడం ద్వారా అదనపు ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఏదైనా ఆల్కహాల్ లేదా డ్రింక్స్‌ని FNDగా నిర్వచించవచ్చు.