Maha Shivaratri : మహాశివరాత్రి(Maha Shivaratri) పర్వదినం సమీపిస్తుండడంలో శివభక్తులంతా మహాదేవుడ్ని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులంతా(Devotees) కూడా రకరకాల ప్రయత్నాలలో ఉన్నారు. శివరాత్రి రోజున శివునికి కొన్ని ప్రత్యేక పువ్వులు సమర్పించడం వల్ల స్వామి వారి అనుగ్రహం లభిస్తుందని పండితులు వివరిస్తున్నారు.
మల్లె– మల్లె పువ్వు సువాసనకు ప్రసిద్ధి. దీనిని సమర్పించడం ద్వారా శివుడు సంతోషిస్తాడు. భక్తులకు సంపద, శ్రేయస్సును ప్రసాదిస్తాడు.
శివుని పూజలో తెల్లటి పువ్వును సమర్పించడం ద్వారా, ప్రతి కోరిక త్వరగా నెరవేరుతుంది. కావున మహాశివరాత్రి రోజున ఈ పుష్పాన్ని భోలేనాథ్కి సమర్పించి, ఆయన అనుగ్రహానికి పాత్రులవ్వండి.
జిల్లేడు– శివుని(Lord Shiva) కి తెల్ల జిల్లేడు పుష్పాన్ని సమర్పించిన వారికి మోక్షం లభిస్తుందని శివపురాణంలో చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితిలో, ఈ మహాశివరాత్రి నాడు భోలేనాథ్కు తెల్లటి జిల్లేడు పువ్వును సమర్పించాలి. ఇది మోక్ష కోరికను నెరవేరుస్తుంది.
విరాజాజులు– శివునికి విరాజాజులు పువ్వును కూడా సమర్పిస్తారని చాలా తక్కువ మందికి తెలుసు. పూజా విధానం ప్రకారం, ఆర్థిక సంక్షోభంలో ఉన్నవారు మహాశివరాత్రి నాడు శివునికి ఈ పువ్వును సమర్పించాలి. ఈ పువ్వును సమర్పించడం ద్వారా, మహాదేవుడు సంతోషిస్తాడు. అతని ఆశీర్వాదంతో ఇంట్లో సంపద, ధాన్యాల నిల్వ చెక్కుచెదరకుండా ఉంటుంది.
గన్నేరు– శివునికి గన్నేరు పువ్వులంటే చాలా ఇష్టం. దీనిని శివరాత్రి రోజున శివునికి సమర్పించడం వల్ల శివ కృప ఎల్లప్పూడూ తన భక్తులపై ఉంటుంది.
శమీ పుష్పం– శివలింగంపై శమీ పుష్పాన్ని సమర్పించడం ద్వారా మహాదేవుని అపారమైన ఆశీర్వాదాలు కురుస్తాయి. మహాశివరాత్రి రోజున శివుని ఆరాధన సమయంలో, ఈ పువ్వును ఆయనకు సమర్పించాలి. మీరు శని దోషం, ఇతర సమస్యల నుండి త్వరగా ఉపశమనం పొందుతారు.
Also Read : ఇప్పుడే సర్రమంటోంది .. ఇక ఏప్రిల్, మేలో మాడు మంటెక్కిపోవడం ఖాయం భయ్యా!