ప్రస్తుతం తెలుగులో దూసుకుపోతున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే..ఠక్కున శ్రీలీల అని చెప్పేస్తారు. ఎందుకంటే నెలకో సినిమాతో థియేటర్లలో సందడి చేస్తుంది ఈ చిన్నది. పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు.
అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరోలందరి సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. వారిలో మహేష్ బాబు, పవన్ కల్యాణ్, రవితేజ లాంటి స్టార్ హీరోలందరి పక్కన నటించే అవకాశం కొట్టేసింది ఈ బ్యూటీ. అయితే సెప్టెంబర్ లో స్కంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ ఖాతాలో మొదటి ప్లాప్ పడింది.
ఆ తరువాత నెలలో వచ్చిన భగవంత్ కేసరితో హిట్ కొట్టినప్పటికీ … కానీ మళ్లీ వెంటనే ఆదికేశవ సినిమాతో మరో ప్లాప్ తో తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడికి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలు గడిచిపోగా…డిసెంబర్ నెలలో విడుదలైన నితిన్ సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
దీంతో మరో ప్లాప్ శ్రీలీల ఖాతాలో పడిపోయింది. ఇలా వరుస ప్లాపులు పడితే శ్రీలీల కెరీర్ కష్టమంటున్నారు సినీ ప్రజలు. ఇలా ఇంకో ప్లాప్ పడితే కనుక శ్రీలీల మరో కృతిశెట్టి అవుతుందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఈ సమయంలో శ్రీలీలను కాపాడేది కేవలం మహేష్ బాబే అని తెలుస్తుంది.
ఎందుకంటే వచ్చే నెలలో మహేష్ బాబు శ్రీలీల నటించిన గుంటూరు కారం సినిమా విడుదల కాబోతుంది. ప్రస్తుతానికి ఈ సినిమా పైనే శ్రీలీల ఆశలు పెట్టుకుంది. లేదంటే శ్రీలీల కెరీర్లో కష్టాలు మొదలైనట్లే. మరి ఈ సినిమా అయినా శ్రీలీల కి ఈ సినిమా అయినా కలిసి వస్తుందో లేదో చూడాలి.
Also read: వరద నీటిలో నానుతున్న సూపర్ స్టార్ హౌస్!