Animal: బోల్డ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి (Tripti Dimri) ‘యానిమల్'(Animal) సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించిన ఈ మూవీలో రణ్ బీర్ కపూర్ (Ranbeer Kapoor), రష్మిక మందన్నా (Rashmika)లతోపాటు త్రిప్తి డిమ్రి ఓ కీలక పాత్రలో నటించి ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది.
Sparkle and Shine✨✨ pic.twitter.com/OwalCMz3Ex
— Triptii Dimri (@tripti_dimri23) October 25, 2022
పాఠాలు నేర్చుకోవాలి..
అయితే ఈ మూవీ సక్సెస్ తో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న నటి.. రీసెంట్ ఇంటర్య్వూలో తన కెరీర్ అండ్ పర్సనల్ విషయాల గురించి మాట్లాడింది. ‘కెరీర్ విషయంలో ఎప్పుడూ బాధపడలేడు. సినీ పరిశ్రమలో ప్రయాణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎత్తుపల్లాలు సహజం. ప్రతిదాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి’ అని చెప్పింది.
— Triptii Dimri (@tripti_dimri23) September 3, 2022
ముందే తెలుసు..
అలాగే ‘యానిమల్’ సినిమాలో జోయాగా నటించి ప్రేక్షకులను అలరించినందుకు ఆనందంగా ఉందని చెప్పింది. ‘సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో విశేష ఆదరణ లభించింది. సినిమా సూపర్ హిట్ అవుతుందని ముందే తెలుసు. నా పాత్రకు ఇంతటి పాపులారిటీ వస్తుందని అస్సలు ఊహించలేదు. ప్రేక్షకులు నాపై చూపించిన ఆదరణకు కృతజ్ఞురాలిని. రోజూ నిద్రపోయే ముందు చిత్రబృందాన్ని గుర్తు చేసుకుని ధన్యవాదాలు చెబుతున్నా. నా జీవితంలో ప్రత్యేకమైన క్షణాలివి. జోయాగా నటించినందుకు అదృష్టంగా భావిస్తున్నా. సంతృప్తిగా అనిపిస్తోంది’ అంటూ హ్యాపీగా ఫీల్ అయింది.
ఇది కూడా చదవండి : Mrunal: పేరుకే ‘క్వీన్ ఆఫ్ రొమాన్స్’.. ఒక్కరూ ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు: మృణాల్
ఇక ‘యానిమల్’లో బాబీ దేవోల్, అనిల్ కపూర్ కీలకపాత్రలు పోషించగా డిసెంబర్లో విడుదలైన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు చేసింది. జనవరి 26 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుండగా.. థియేటర్ వెర్షన్ కోసం తొలగించిన కొన్ని సన్నివేశాలను యాడ్ చేసి నెట్ఫ్లిక్స్లో విడుదల చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
💙💙💙 pic.twitter.com/EM1Wd1f8Pf
— Triptii Dimri (@tripti_dimri23) June 16, 2022
ఈ సినిమా తర్వాత తెలుగులోనూ త్రిప్రిక్తి అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబోలో రాబోతున్న మూవీలో మెయిన్ హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని సమాచారం.