TG: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 2023లో నిర్వహించిన చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO), ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (EO) పోస్టుల పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీజీపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. పేపర్ లీక్ నేపథ్యంలో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ, సిట్ నివేదికల ఆధారంగా 2023 జనవరి 3, 8 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షలను క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలిపింది. త్వరలో కొత్త పరీక్షల తేదీలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.