తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా పారిపాలన సాగుతున్న ఈ సమయంలో ఢిల్లీ ముసుగులో బీజేపీ-కాంగ్రెస్ ఏపీలో తెలంగాణను కలిపే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం కరీంనగర్లో మీడియా సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్- బీజేపీలు ఇద్దరు కలిసే అభ్యర్థులను నిలబెడుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ భీపాంలు బీజేపీ ఆఫీస్‌లో.. కాంగ్రెస్ ఆఫీస్‌లో బీజేపీ భీపామ్ లు తయారు అవుతున్నాయని గంగుల ఆరోపించారు. కేసీఆర్ పాలనలో యువత, రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు.
గత పాలనలో రోజుకు మూడు గంటల కరెంటు మాత్రమే చూశామని.. ఈ రోజు 24 గంటల కరెంటు చూస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ మాత్రమే తెలంగాణ యువత భవిష్యత్త్ను కాపాడేదనిన్నారు. యువత భవిష్యత్ బాగుండాలంటే కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని మంత్రి అన్నారు. మరొక అవకాశం ఇస్తే కరీంనగర్ ను ఇంకా మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఈటెల రాజేందర్‌కి దమ్ముంటే గజ్వేల్ లో మాత్రమే పోటీ చేయాలని గంగుల సవాల్ విసిరారు. కరీంనగర్లో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఈనెల18న సభ ఉంటుందన్నారు.
సర్వేలన్ని మాకే అనుకూలం
హైదరాబాద్ సంపద కొల్లగొట్టడానికే బీజేపీ-కాంగ్రెస్ నేతలు వస్తున్నారని మంత్రి మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డికి తెలంగాణ గురించి ఎందుకు..? అని ప్రశ్నించారు. అటూ ఇటూ అయితే తెలంగాణ ఎత్తుకుపొవడానికి చూస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. బండి సంజయ్ గంజాయి ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కరీంనగర్ గంజాయి ఫ్రీగా ఉండాలని సీపీకి ఇంతకు ముందే చెప్పామన్నారు. 2018లో కూడా సర్వేలు కాంగ్రెస్‌కే అని అన్నారు. కానీ మేమే అధికారంలోకి వచ్చామకని గుర్తు చేశారు. ప్రస్తుతం సర్వేలన్ని తమకే అనుకూలంగా ఉన్నాయని గంగుల చెప్పారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పరిపాలనలో విఫలం అయ్యిందని మంత్రి గంగుల విమర్శించారు. కర్ణాటకలో పథకాలు అమలు చెయడానికి ఇబ్బందులు పడుతున్నారు.. ఇక్కడ ఏం ఇస్తారు..? అని ప్రశ్నించారు. బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని.. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ సీఎం ఎలా అవుతాడని మంత్రి గంగుల ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబుకు ఏదైనా జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత.. యనమల సంచలన ప్రెస్ మీట్