Charmme Kaur : స్టార్ నటి, నిర్మాత ఛార్మి కౌర్ (Charmme Kaur) సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టి జనాల దృష్టిని ఆకర్షించింది. కొంతకాలంగా నటకు దూరమై సినిమా నిర్మాణ బాధ్యతల్లో నిమగ్నమవుతున్న ఆమె ఇటీవల పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ (vijay) దేవరకొండ హీరోగా వచ్చిన ‘లైగర్’ (Liger) కు భారీ పెట్టుబడులు పెట్టింది. అయితే ఈ మూవీ అనుకున్న రేంజ్ లో జనాలకు ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అంతేకాదు ఈ సినిమా బిజినెస్ విషయంలో ఈడీ కేసులు కూడా ఎదుర్కోవడంతోపాటు ఛార్మీ.. పూరితో (Poori jaganath) ఎఫైర్స్ పెట్టుకుందనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నటి.. తాజాగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
View this post on Instagram
ఇది కూడా చదవండి : Manoj: ఆ అర్ధనగ్న ఫొటో నాది కాదు.. కిల్లర్ లుక్ చర్చపై మనోజ్
కౌగిలి మిస్ అవుతున్నా..
ఈ మేరకు ఇన్ స్టా వేదికగా కుక్కపిల్లను ప్రేమగా హత్తుకున్న ఫొటోను షేర్ చేసిన ఛార్మీ.. ‘నువ్వు లేకుండా 2 సంవత్సరాలు. నీ కౌగిలిని చాలా మిస్ అయ్యాను. నీ ప్రేమను కోల్పోతున్నాను. నువ్వు ఎప్పుడూ నాకు అత్యంత ఇష్టమైన మగబిడ్డగా ఉంటావు. నా జీవితంలోకి మళ్లీ త్వరగా తిరిగి రా . నువ్వు లేకుండా అమ్మ జీవితం అసంపూర్ణం’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
DOUBLE ISMART ON 😎
Can’t wait to set the stage ablaze again with the #DoubleISMART, fueled by your electrifying DOUBLE ENERGY in the iconic Puri gari style! 🤘🏻
Let’s kill it USTAAD @ramsayz 🤙 https://t.co/PyJ5RRIlTL
— Charmme Kaur (@Charmmeofficial) July 10, 2023
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా ఆమె ఫాలోవర్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కుక్క మీద ప్రేమతో పెట్టినప్పటికీ.. ప్రియుడి కౌగిలి కోసం తెగ ఆరాటపడుతోందని జనాలు అంటున్నారు. మరికొందరు మాత్రం పూరిని కూడా ఇందులోకి లాగుతూ నెగెటీవ్ గా స్పందిస్తున్నారు. మరికొందరు పెళ్లి చేసుకోమంటూ సూచిస్తున్నారు. ఇక ఆమె ప్రస్తుతం ఉస్తాద్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తోంది.