Counting Process: నరాలు తెగే ఉత్కంఠ.. రేపు అంటే జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఈవీఎం బాక్స్ లు తెరుచుకుంటాయి. అందులో నమోదైన ఓట్ల లెక్కింపు దేశంలో మూడోసారి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కానుందా లేదా అనేది తెలుస్తుంది. అదేవిధంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు ఎస్ చెప్పారనేది తేలిపోతుంది. అయితే, చాలామందికి ఎన్నికల కౌంటింగ్ గురించి అనుమానాలు ఉంటాయి? ఓట్లు ఎలా లెక్కిస్తారు? దాని పర్యవేక్షణ ఎలా జరుగుతుంది? అవకతవకలు లేకుండా ఓట్ల లెక్కింపు జరుగుతుందా? ఇలాంటి ప్రశ్నలు అందరికీ ఉంటాయి. కొంతమంది నేతలు ఈ మధ్య కాలంలో ఈవీఎంలు, పోలింగ్, ఓట్ల లెక్కింపు ఈ అంశాలపై ప్రజల్ని గందరగోళ పరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన విషయాలను అర్ధం చేసుకుందాం.
ఓట్ల లెక్కింపు ఎక్కడ జరుగుతుంది? ఎవరు చేస్తారు?
Counting Process: లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ – ఓట్ల లెక్కింపు బాధ్యత రిటర్నింగ్ అధికారి అంటే ROకె ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ సలహా మేరకు ఎన్నికల సంఘం ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ అధికారిని నియమిస్తుంది. ఆయన ప్రభుత్వ అధికారి. సాధారణంగా, లోక్‌సభ ఎన్నికల్లో జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆర్ఓగా చేస్తారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ఆర్ఓ మాత్రమే ఓట్ల లెక్కింపు కోసం సరైన స్థలాన్ని ఎంచుకుంటారు. ఓట్ల లెక్కింపు తేదీని ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది.
ఓట్ల లెక్కింపు ఎప్పుడు ప్రారంభమవుతుంది.. ఎంత సమయం పడుతుంది?
Counting Process: ఎన్నికల సంఘం ప్రకారం, ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో రిటర్నింగ్ అధికారి సూచనల మేరకు సమయాన్ని కూడా మార్చుకోవచ్చు. ముందుగా, బ్యాలెట్ పేపర్ – ETPBS(ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ) ద్వారా పోలైన ఓట్లను లెక్కిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు సాధారణంగా ETPBS ద్వారా ఓటు వేస్తారు.సర్వీస్ ఓటర్లలో సైనికులు, ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, దేశం వెలుపల పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు ఉంటారు. ఈ ఓట్ల లెక్కింపు కోసం అరగంట పడుతుంది.
ఉదయం 8.30 గంటల తర్వాత అన్ని టేబుళ్లపై ఏకకాలంలో ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న రిటర్నింగ్ అధికారి (RO) ప్రతి రౌండ్ కౌంటింగ్ తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. అది ఎన్నికల సంఘం వెబ్సైట్లో కూడా అప్ డేట్ అవుతుంది. ఓట్ల లెక్కింపు మొదటి ట్రెండ్ ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది.
గోప్యంగా సమాచారం..
Counting Process: ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 128 – 129 ప్రకారం, ఓట్ల లెక్కింపునకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచడం చాలా ముఖ్యం. ఓట్ల లెక్కింపునకు ముందు ఏ అధికారులు ఏ నియోజకవర్గాన్ని, ఎన్ని టేబుళ్లపై లెక్కిస్తారన్న సమాచారం వెల్లడించరు . అధికారులంతా ఉదయం 5 నుంచి 6 గంటలలోపు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలి. దీని తర్వాత, జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి, కౌంటింగ్ కేంద్రంలోని రిటర్నింగ్ అధికారి ర్యాండమ్‌గా సూపర్వైజర్లు, ఉద్యోగులకు హాల్ నంబర్లు – టేబుల్ నంబర్లను కేటాయిస్తారు.
ఏదైనా ఒక కౌంటింగ్ హాలులో కౌంటింగ్ కోసం 14 టేబుళ్లు, రిటర్నింగ్ అధికారికి 1 టేబుల్ ఉంటాయి. ఏ హాలులోనైనా 15 టేబుళ్లకు మించి పెట్టాలనే నిబంధన లేదు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు టేబుళ్ల సంఖ్యను పెంచవచ్చు. ఉదాహరణకు, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2023 తర్వాత, ఇండోర్-2లో కౌంటింగ్ కోసం 21 టేబుల్స్ ఏర్పాటు చేశారు.
Counting Process: 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం – అరుణాచల్ ప్రదేశ్ 4 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఈ రాష్ట్రాల్లోని ఓట్ల లెక్కింపు రూమ్ ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా ఉండవచ్చు. ఎన్నికల రాజకీయాలపై పరిశోధన చేసే సంస్థ ‘PRS INDIA’ ప్రకారం, ఒక నియోజకవర్గంలో లోక్‌సభ- అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కోసం ఒక కౌంటింగ్ హాల్లో 7 టేబుల్స్ – లోక్‌సభ కౌంటింగ్ కోసం 7 టేబుళ్లను ఏర్పాటు చేస్తారు.
ఒక అభ్యర్ధికి ఎంతమంది ఏజెంట్లు ఉండవచ్చు?
ఓట్ల లెక్కింపు సమయంలో, అన్ని టేబుల్ల వద్ద ప్రతి అభ్యర్థి తరపున ఒక ఏజెంట్ ఉంటారు. రిటర్నింగ్ అధికారి దగ్గర ఒక ఏజెంట్ కూర్చుంటాడు. ఈ విధంగా, ఒక హాలులో ఏ అభ్యర్థి తరపున అయినా సరే 15 మంది కంటే ఎక్కువ ఏజెంట్లు ఉండకూడదు. ప్రత్యేక పరిస్థితుల్లో టేబుళ్ల సంఖ్యను పెంచితే ఏజెంట్ల సంఖ్య పెరగవచ్చు.
ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఎన్ని చోట్ల లెక్కింపు ఉంటుంది..
Counting Process: ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకే కౌంటింగ్ కేంద్రం మాత్రమే ఉంటుంది. అంటే, అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఓట్లు ఒకే దగ్గర లెక్కిస్తారు. అయితే, ఒక పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ఒకటి కంటే ఎక్కువ చోట్ల చేయవచ్చు. లోక్‌సభ స్థాన పరిధిలో చాలా అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి… ఇలాంటి పరిస్థితుల్లో కౌంటింగ్ హాలులో రద్దీని తగ్గించేందుకు రిటర్నింగ్ అధికారితో పాటు మరో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సహాయంగా ఉంటారు.
ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకుని, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అసెంబ్లీ స్థాయిలో కౌంటింగ్ హాల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఓట్లను లెక్కించవచ్చు.
కౌంటింగ్ కోసం అభ్యర్థుల ఏజెంట్లను ఎవరు నియమిస్తారు?
Counting Process: అభ్యర్థి స్వయంగా తన ఏజెంట్‌ను ఎంచుకుని, స్థానిక ఎన్నికల అధికారి నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల నిర్వహణ చట్టం 1961 ముసాయిదా 18లో ఈ నియమం ఉంది. కౌంటింగ్ తేదీకి మూడు రోజుల ముందు పేర్లు, ఫొటోలతో పాటు కౌంటింగ్ ఏజెంట్ల లిస్ట్ విడుదల చేస్తారు.
కౌంటింగ్ సజావుగా జరగాలంటే..
కౌంటింగ్ సమయంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.
- కౌంటింగ్ సమయంలో, రిటర్నింగ్ అధికారి ఏ ఏజెంట్‌నైనా పరీక్షించవచ్చు
- ప్రతి అభ్యర్థి ఏజెంట్‌కు ఒక రకమైన బ్యాడ్జ్‌ను ఇస్తారు, వాటిని చూస్తే వారు ఏ అభ్యర్థి ఏజెంట్ అని అర్థం చేసుకోవచ్చు.
- ఏజెంట్ హాల్లోకి వచ్చిన తరువాత కౌంటింగ్ పూర్తయ్యే వరకు బయటకు వెళ్లడానికి వీలు లేదు.
- రిటర్నింగ్ అధికారి సూచనలను పాటించని పక్షంలో ఏ వ్యక్తినైనా హాల్ నుండి బయటకు పంపవచ్చు.
- సభాస్థలికి సమీపంలో తాగునీరు, టాయిలెట్స్, ఆహారం తదితర ఏర్పాట్లు ఉంటాయి.
- ఓట్ల లెక్కింపులో నిమగ్నమైన ఉద్యోగులు, భద్రతా సిబ్బంది మినహా ఎవరూ హాలులోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడానికి అనుమతి ఉండదు.
- ప్రతి రౌండ్ కౌంటింగ్ తర్వాత, హాల్లో ఉన్న అబ్జర్వింగ్ ఆఫీసర్ రాండంగా ఏదైనా రెండు టేబుల్లను ఎంచుకుని, రెండు టేబుల్ల ఓట్లను పోల్చి చూస్తారు.
- ఫలితం సరిగ్గా సరిపోలినప్పుడు మాత్రమే అది పూర్తయినట్టు ప్రకటిస్తారు. ఆ ఫలితాన్ని వెబ్సైట్లో అప్ డేట్ చేస్తారు
కౌంటింగ్ ప్రాంతంలో ఏదైనా తప్పు జరిగితే..
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ SY ఖురేషీ ప్రకారం, ఈ 4 పరిస్థితులు కౌంటింగ్ ప్రాంతం చుట్టూ అంటే 50 మీటర్ల లోపల కనిపిస్తే, మీరు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు…
- ఎవరైనా కౌంటింగ్ ప్రాంతంలోకి ప్రవేశించడానికి లేదా ప్రవేశించడానికి ప్రయత్నిస్తే.
- కౌంటింగ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న వారిలో ఎవరి కదలికలపైనైనా మీకు ఏదైనా సందేహం ఉంటే.
- మీరు ఎవరినైనా ఆయుధంతో చూసంతృప్తి చెందకపోయినా.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అంటే EVMలో ఏదో లోపం ఉందని మీరు భావించినా..
రిటర్నింగ్ అధికారి ఫిర్యాదుపై స్పందించకపోతే..
కౌంటింగ్ రోజు, ఏదైనా అవకతవకలు జరిగినట్లయితే, అక్కడ ఉన్న రిటర్నింగ్ అధికారికి కంప్లైంట్ చేయవచ్చు. అతను ఫిర్యాదుపై చర్య తీసుకోకపోతే, జిల్లా ఎన్నికల అధికారికి ఫోన్, వ్రాతపూర్వక, ఫ్యాక్స్ లేదా ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇది కాకుండా నేరుగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుల కోసం ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశారు.
కంప్లైంట్ ఎన్ని రోజుల తరువాతైనా చేయవచ్చా..
Counting Process: కౌంటింగ్ కు సంబంధించిన కంప్లైంట్స్ వెంటనే చేయాలి. మీరు ఏదైనా సమస్యను అనుమానించిన వెంటనే, అక్కడికక్కడే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. ఆలస్యం చేస్తే ప్రయోజనం లేదు. ఇందుకు ఎన్నికల సంఘం 24 గంటల సమయాన్ని మాత్రమే ఇస్తుంది.
అంటే జూన్ 4న లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు అంటే జూన్ 5వ తేదీ ఉదయం 8 గంటల వరకు మాత్రమే ఫిర్యాదులు చేయవచ్చు. ఫలితాలు వెలువడిన తర్వాత.. ఫలితాలతో మీరు సంతోషంగా లేకుంటే, ఫలితం కోర్టులో మాత్రమే సవాలు చేసే అవకాశం ఉంటుంది.
వేరే రాష్ట్రంలో ఉంటూ.. సొంత రాష్ట్రంలోని కౌంటింగ్ పై కంప్లైంట్ చేయవచ్చా?
Counting Process: అవును, చేయవచ్చు. మీకు ఫోన్లో సమాచారం అందించిన వ్యక్తి ముందుగా అక్కడికక్కడే ఫిర్యాదు చేయాలి. అయితే, మీరు దేశంలో లేదా ప్రపంచంలోని ఏ ప్రాంతం నుండి అయినా దీని గురించి ఫిర్యాదు చేయవచ్చు. దీని కోసం మీ పౌరసత్వం భారతదేశానికి చెందినదిగా ఉండాలి.
కౌంటింగ్ లో అవకతవకలకు పాల్పడినట్టు తేలితే..
ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 136 ప్రకారం కౌంటింగ్ కేంద్రంలో అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులు- పౌరులు ఇద్దరికీ శిక్ష విధించే నిబంధన ఉంది. ఎవరైనా దోషిగా తేలితే 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
Also Read: కౌంటింగ్ ఏజెంట్లను టేబుళ్ల వద్దకు అనుమతిస్తాం: ఎలక్షన్ కమిషన్!
ఓటింగ్ మెషిన్లో మార్పులు లేదా ట్యాంపరింగ్ జరిగినట్లు ఫిర్యాదు వస్తే..
Counting Process: ఏదైనా కేంద్రంలో ఓటింగ్ యంత్రంలో మార్పులు, అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు అందితే రిటర్నింగ్ అధికారి వెంటనే విచారణ జరుపుతారు. ఓటింగ్ మెషీన్లో అవకతవకలు జరిగినట్లు రుజువైతే దానిని ప్రత్యేకంగా ఉంచుతారు. అందులో నమోదైన ఓట్లను లెక్కించరు.
దాని సమాచారం రాష్ట్ర, కేంద్రంలోని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి అందిస్తారు. ఓట్ల లెక్కింపును పూర్తిగా నిలిపివేయాల్సిన అవసరం లేదు. ఫిర్యాదు అందిన మెషిన్ మాత్రమే
ఓట్ల లెక్కింపు తర్వాత EVMని ఏం చేస్తారు?
ఫలితాల ప్రకటన, గెలిచినా అభ్యర్థికి ధ్రువీకరణ పత్రం ఇవ్వడం పూరయిన తరువాత.. ఈవీఎం మళ్లీ స్ట్రాంగ్ రూమ్‌కు మారుస్తారు. ఈవీఎం లెక్కింపు తర్వాత 45 రోజుల పాటు అదే స్టోర్ రూమ్‌లో ఉంచుతారు. తర్వాత దానిని పెద్ద స్టోర్ రూమ్‌కు మారుస్తారు. ఎన్నికల సంఘం ప్రకారం, ఈ ఈవీఎంలలోని డేటా తదుపరి 6 నెలల వరకు స్టోర్ చేసి ఉంచుతారు. ఆరు నెలల పాటు మరే ఇతర ఎన్నికలకు దీనిని ఉపయోగించరు.